ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా వస్తే రికార్డులు చెల్లాచెదురు అవుతాయి అని నమ్మిన ప్రతి ప్రభాస్ ఫ్యాన్ కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేసింది సలార్ టీజర్. మొహం కూడా రివీల్ చేయకుండా టీజర్ కట్ చేస్తే ఆడియన్స్ 24 గంటల్లోనే 83 మిలియన్ వ్యూస్ ఇచ్చారు అంటే సలార్ రేంజ్ అండ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన మోస్ట్ వయొలెంట్ మ్యాన్ సలార్ ని డైనోసర్ తో పోలుస్తూ బాక్సాఫీస్ లెక్కల వేట గురించి ట్రేడ్ వర్గాలు ఇప్పటి నుంచే ప్రిడిక్షన్స్ స్టార్ట్ చేసాయి. రిలీజ్ కి ఇంకా నెల రోజులే ఉన్నాయని ఫాన్స్ కౌట్ డౌన్ కూడా స్టార్ట్ చేసారు. అన్నీ బాగుంటే ఈరోజు సలార్ సినిమా డే 1 ఎంత విధ్వంసం సృష్టించిందో మాట్లాడుకునే వాళ్లం కానీ ఊహించని విధంగా సలార్ వాయిదా పడి సినీ అభిమానులకి షాక్ ఇచ్చింది.
ప్రభాస్ డబ్బింగ్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ లో పెండింగ్ వర్క్స్, కొంచెం ప్యాచ్ వర్క్… ఇలా రకరకాల కారణాలతో సలార్ సినిమా వాయిదా పడింది. సరేలే ఎప్పుడు రిలీజ్ అయినా బాక్సాఫీస్ బద్దలవుతుంది కదా అనే హోప్ తో ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేసే రిలీజ్ డేట్ ని ఈరోజు సలార్ మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. ఏ క్షణం అయినా సలార్ రిలీజ్ డేట్ బయటకి రావొచ్చు. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని వదలకుండా ట్రెండ్స్ చేస్తూనే ఉన్నారు. రిలీజ్ డేట్ కొత్త పోస్టర్ తో వదిలితే మాత్రం సలార్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవ్వడం గ్యారెంటీ. మరి ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు డిసెంబర్ 21/22న సలార్ సినిమాని రిలీజ్ చేస్తున్నాడా? లేక కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేశాడా అనేది చూడాలి.