Leading News Portal in Telugu

Rules Ranjan : సెన్సార్ పూర్తి చేసుకున్న రూల్స్ రంజన్..


యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ రూల్స్‌ రంజన్ . రూల్స్‌ రంజన్ మూవీ నుంచి విడుదల అయిన ఫస్ట్‌ లుక్‌, సాంగ్స్‌,టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతూ..సూపర్ బజ్‌క్రియేట్ చేసాయి.ఈ సినిమాను రుథిరమ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి కిరణ్ అబ్బవరం సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. అక్టోబర్‌ 6నుంచి హెలేరియస్ ఫన్ రైడ్ షురూ కానుంది.. అంటూ రిలీజ్ చేసిన తాజా లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మెహర్ చాహల్‌, వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్‌, అజయ్‌, అతుల్ పర్చురే, విజయ్‌ పాట్కర్‌, మకరంద్‌ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్‌, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్ మరియు సిద్దార్థ్ సేన్ ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ హీరోహీరోయిన్లు రొమాంటిక్ లుక్‌ ను కూడా విడుదల చేశారు. కొత్త తేదీ కానీ అపరిమిత వినోదం పక్కా.. అంటూ మేకర్స్‌ రిలీజ్ చేసిన ఈ లుక్‌ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్‌ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. అలాగే ఈ సినిమాకి అమ్రీష్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.అందులోను సుగంధాల గాలి పంచే సాంగ్ మరింత ట్రెండింగ్ గా నిలిచింది. ఈ పాటలో నేహా శెట్టి అందాల ఆరబోత మరింత హైలైట్ అని చెప్పొచ్చు.ఈ సినిమాలో నేహా శెట్టి తన దైన నటనతో పాటు అదిరిపోయే అందాలతో ప్రేక్షకులని మరింతగా ఆకట్టుకునేందుకు సిద్ధంగా వుంది.