Leading News Portal in Telugu

Ravibabu: సినిమా వాళ్ల గ్లామర్, చంద్రబాబు కష్టాలు ఏవీ శాశ్వతం కాదు: రవిబాబు


Ravibabu: జీవితంలో ఏవీ శాశ్వతం కాదన్నారు యాక్టర్, డైరెక్టర్ రవిబాబు. సినిమా వాళ్ల గ్లామర్ రాజకీయ నాయకుల పవర్ గానీ అసలు శాశ్వతం కాదన్నారు. అలాగే చంద్రబాబుకు వచ్చిన కష్టాలు కూడా త్వరలోనే తొలిగిపోతాయన్నారు. రామారావు ఫ్యామిలీ, చంద్రబాబు కుటుంబం తన కుటుంబానికి ఆప్తులని చెప్పుకొచ్చారు. చంద్రబాబు గురించి చెప్పాలంటే ఆయన ఏదైనా పనిచేసే ముందు వంద యాంగిల్స్ లో చూసి, అందరినీ సంప్రదించి డెసిషన్ తీసుకుంటారన్నారు. ఆయనకు ఈ రోజే లాస్ట్ డే అని తెలినప్పటికీ.. నెక్ట్స్ యాభై సంవత్సరాలకు సోషల్ డెవలప్ మెంట్ గురించి ప్లాన్ చేస్తారని రవిబాబు అన్నారు.

ఆయన డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదు. ప్రతి క్షణం ప్రజల కోసమే ఆలోచించే చంద్రబాబును ఎటువంటి ఆధారం లేకుండా, అక్రమ కేసులు పెట్టి, చంద్రబాబు గారిని జైల్లో పెట్టి ఎందుకు హింసిస్తున్నారో అర్ధం కావటం లేదన్నారు. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు చాలా సహజం. కానీ 73ఏళ్లు ఆయనను జైల్లో పెట్టి హింసించడం ఏ ఎత్తో పై ఎత్తో అయితే మాత్రం అది చాలా దారుణం అన్నారు. అశాశ్వతమైన పవర్ ను ఉన్న వాళ్లను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఏ పవర్ నైతే ఉపయోగించి జైల్లో పెట్టారో.. అదే పవర్ ఉపయోగించి ఆయనను వదిలేయమని ప్రాధేయపడ్డాడు. మీరు చిటికేస్తే జరిగిపోతుంది. ఆయనకు జైలు నుంచి కాకుండా బయట ఉంచి ఇష్టం వచ్చినట్లు ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలని కోరారు. ఆయనైతే దేశాన్ని వదిలి పారిపోడన్నారు. చంద్రబాబును వదిలేస్తే చరిత్ర మిమ్మల్ని జాలి మనసు, మోరల్స్ ఉన్న వాళ్లలా గుర్తుంచుకుంటుందన్నారు.