Leading News Portal in Telugu

Madam Chief Minister: దర్శకనిర్మాతే హీరోయిన్ గా ‘మేడం చీఫ్ మినిస్టర్’


Madam Chief Minister Movie Started: తెలుగు సినీ పరిశ్రమలో లేడీ డైరెక్టర్లు చాలా తక్కువే. ఈమధ్యన లేడీ డైరెక్టర్ల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. తాజాగా డా.సూర్య రేవతి మెట్టుకూరు హీరోయిన్ గా నటిస్తూ స్వీయ దర్శకనిర్మాణంలో ఒక సినిమా ప్రారంభించారు. ఇక ఈరోజు పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రేవతి క్లాప్‌ నివ్వగా తెలంగాణ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్‌ఆర్‌పి ప్రొడక్షన్స బ్యానర్‌పై తొలి చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి ‘మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హీరోయిన్, దర్శక నిర్మాత రేవతి మాట్లాడుతూ బాగా చదువుకోవాలనే తపనలో అమెరికా వెళ్లానని సక్సెస్‌ఫుల్‌ గా చదువు పూర్తి చేశానని అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ చేసి పబ్లిక్‌ అడ్మినిసే్ట్రషనలో డాక్టరేట్‌ చేసి అక్కడొక కంపెనీ ప్రారంభించానని పేర్కొన్న ఆమె అమెరికాలో ఉన్నా దేశాన్ని మాత్రం మరచిపోలేదని, అక్కడ నన్ను భరతమాత ముద్దు బిడ్డగా చూసేవారని అన్నారు.

Miss Shetty Mr Polishetty: ఓటీటీలోకి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్

దేశం కోసం ఏం చేద్దాం అనుకుంటున్న తరుణంలో చాలా ఆలోచనలలో భాగంగా ఓ విలేజ్‌ని అడాప్ట్‌ చేసుకున్నానని ఆమె అన్నారు. నా సంపదలో 20 శాతం సోసైటీకి ఇచ్చేస్తున్నానని, ఇప్పటికి 5 గ్రామాలను దత్తత తీసుకున్నానని అన్నారు. ప్రస్తుతం సమాజం ఉన్న పరిస్థితులను చూసి ఓ సినిమా ద్వారా ఆ పరిస్థితులను చెప్పాలనిపించిందని, అందుకే మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌ సినిమా ప్రారంభించానని అన్నారు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ఉంటుందని, యువతను బాగా కనెక్ట్‌ అవుతుందని అన్నారు. ఇది పొలిటికల్‌ సినిమా కాదు, పబ్లిక్‌ మూవీ. ప్రపంచంలో ఇండియా అనేది చాలా గొప్పది అని చెప్పాలనేదే నా గోల్‌ అని ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తా’’ అని ఆమె అన్నారు. మాటలు-స్ర్కీనప్లే సుహాస్‌ మీరా అందిస్తున్న ఈ సినిమాకి కార్తీక్‌ బి.కొండకండ్ల సంగీతం అందిస్తున్నారు.