Leading News Portal in Telugu

Dunki: రాజ్ కుమార్ హిరాణి రిమేక్ చేస్తున్నాడా? ఎత్తుకొచ్చిన సినిమాతో పోటీ ఏంటి సర్?


ప్రస్తుతం ఇండియాలో వినిపిస్తున్న ఒకే ఒక్క న్యూస్… సలార్ vs డుంకి. క్లాష్ ఆఫ్ టైటాన్స్ గా పేరు తెచ్చుకున్న ఈ ఎపిక్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ 22న జరగనుంది. షారుఖ్ ఖాన్, ప్రభాస్ ల మధ్య జరగనున్న ఈ నెవర్ బిఫోర్ బాక్సాఫీస్ వార్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నుంచే ఎవరికీ ఎన్ని థియేటర్స్ వస్తాయి? ఎవరు ఓపెనింగ్ రోజున ఎక్కువ కలెక్షన్స్ రాబడుతారు? ఎవరు హిట్ కొట్టి క్లాష్ లో జెండా ఎగరేస్తారు అనేది ఆడియన్స్ ని ఇంట్రెస్టింగ్ టాపిక్ అయ్యింది. ఈ క్లాష్ గురించి డిస్కషన్ జరుగుతున్న టైంలో సోషల్ మీడియాలో డుంకి సినిమా గురించి ఒక ఊహించని విషయం బయటకి వచ్చింది. తాప్సి, షారుఖ్ ఖాన్ జంటగా నటిస్తున్న డుంకి సినిమాని రాజ్ కుమార్ హిరాణి డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్ అనగానే ఒక మోడరన్ క్లాసిక్ సినిమాని చూడబోతున్నాం అనే ఫీలింగ్ లో బాలీవుడ్ ఆడియన్స్ ఉన్నారు. అయితే డుంకి సినిమా దుల్కర్ సల్మాన్ నటించిన CIA (కామ్రేడ్ ఇన్ అమెరికా) అనే సినిమాకి ఫ్రీమేక్ గా తెరకెక్కుతుంది అనే వార్త వైరల్ అవుతోంది.

డుంకి సినిమా ఇల్లీగల్ మైగ్రాంట్స్ కథతో రూపొందుతుంది అనే విషయం తెలిసిందే. ఇదే కథతో CIA సినిమా రూపొంది, కేరళలో సూపర్ హిట్ అయ్యింది. ఒక అమ్మాయి కోసం సల్మాన్ చేసే ప్రయాణం… ఒక కామ్రేడ్ చేసే ప్రయాణం CIAలో బ్యూటిఫుల్ గా చూపించారు. ఎమోషనల్ రోలర్ కాస్టర్ రైడ్ లా ఉండే CIA సినిమాని తెలుగు, తమిళ ఆడియన్స్ కూడా చాలా మందే చూసి ఉంటారు. ఇప్పుడు డుంకి సినిమా CIAకి ఫ్రీమేక్ అనే మాట వినిపిస్తూ ఉండడంతో… సోషల్ మీడియాలో రీమేక్/ఫ్రీమేక్ సినిమాలతో మా సినిమాకి పోటీ ఏంటి సర్… పక్కకి జరగండి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే రాజ్ కుమార్ హిరాణి క్రెడిబిలిటీ తెలిసిన వాళ్లు, ఆయన వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ తెలిసిన వాళ్లు మాత్రం డుంకి సినిమా రీమేక్ అయ్యే అవకాశమే లేదంటున్నారు. ఈ విషయంలో నిజమేంటో తెలియాలి అంటే ఏదైనా ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.