Leading News Portal in Telugu

Tiger Nageswara Rao: ‘హేమ లత లవణం’గా రేణు దేశాయ్…


మాస్ మహారాజా రవితేజ హీరోగా, డెబ్యూ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషనల్ కంటెంట్ ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్న మేకర్స్… అక్టోబర్ 3న టైగర్ నాగేశ్వర రావు ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారు. ట్రైలర్ వచ్చే లోపై క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్స్ వదులుతున్న చిత్ర యూనిట్… లేటెస్ట్ గా రేణు దేశాయ్ పాత్రకి సంబంధించిన లుక్ ని రిలీజ్ చేసారు. తెల్ల చీర కట్టుకోని, అద్దాలు పెట్టుకోని, ఒక చిన్న బాబుని పట్టుకున్నట్లు ఉన్న రేణు దేశాయ్ పోస్టర్ ని రవితేజ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

టైగర్ నాగేశ్వర రావు సినిమాలో రేణు దేశాయ్ ‘హేమలతా లవణం’ పాత్రలో నటిస్తోంది. హేమలతా లవణం! ప్రముఖ దళిత రచయిత గుర్రం జాషువా కుమార్తె! అంతేకాదు… నాస్తికోద్యమ నిర్మాత గోరా కోడలు!! గోరా తనయుడు లవణంను వివాహం చేసుకున్న సామాజిక సంస్కర్త. మరీ ముఖ్యంగా స్టువర్ట్ పురం దొంగలలో పరివర్తన తీసుకురావడానికి విశేషమైన కృషి చేసిన నారీమణి. ఆ పాత్రను వెండితెరపై పోషించే గొప్ప అవకాశం రేణు దేశాయ్ కు లభించింది. ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ గతంలో ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని విడుదల చేసారు, లేటెస్ట్ గా పోస్టర్ ని వదిలి ఫుల్ లుక్ ని రివీల్ చేసారు.