Leading News Portal in Telugu

Bhagavanth Kesari: బాలయ్య… ఆ పాప శ్రీలీల కాదు కదా?


నందమూరి నట సింహం బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో మొదటిసారి వస్తున్న సినిమా భగవంత్ కేసరి. రాయలసీమ దాటి తెలంగాణలో సింహం అడుగు పెడుతూ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి స్టైల్ లో ఉంటూనే బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి భగవంత్ కేసరి సినిమా తెరకెక్కింది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో బాలయ్యకి జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా… యంగ్ హీరోయిన్ శ్రీలీల స్పెషల్ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటికే బాలయ్య-శ్రీలీల ఉన్న గణపతి సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్. వినాయక చవితి నాడు రిలీజ్ అయిన ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా భగవంత్ కేసరి నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు.

భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో జోష్ కనిపించట్లేదు అనుకుంటున్న సమయంలో మేకర్స్ నుంచి ఒక మంచి మాస్ పాట వస్తుంది అనుకుంటే… కథకి స్టిక్ అవుతూ “ఉయ్యాలా ఉయ్యాలా” అనే ఫీల్ గుడ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 4న బయటకి రానున్న ఈ సాంగ్ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ని కూడా వదిలారు. ఈ పోస్టర్ లో బాలయ్య కాస్త యంగ్ లుక్ లో ఉన్నాడు, పక్కన చిన్న పాప కూడా ఉంది. ఈ పోస్టర్ ని బట్టి ఇది బాలయ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే సాంగ్ అనే విషయం అర్ధమవుతుంది కానీ బాలయ్య పక్కన ఉన్న పాప శ్రీలీలనా కాదా అనే విషయం తెలియాల్సి ఉంది. భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల బాలయ్య కూతురు క్యారెక్టర్ లో నటించట్లేదు అని అనీల్ రావిపూడి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే పోస్టర్ లో కనిపిస్తున్న పాప శ్రీలీల అయ్యే అవకాశం కనిపించట్లేదు. మరి అనీల్ రావిపూడి ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేసాడు అనేది చూడాలి.