Leading News Portal in Telugu

Bhagavanth Kesari: థమన్ బాదుడుకు బాక్సులు బద్దలవ్వాల్సిందే…


బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాకి… బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాకి ఉన్న కామన్ పాయింట్… థమన్. ఈ రెండు సినిమాలని థమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకాశానికి ఎత్తాడు. ముఖ్యంగా అఖండ సినిమాలో సెకండ్ క్యారెక్టర్ కి, వీర సింహా రెడ్డి క్యారెక్టర్ ఇంట్రో సీన్ తో థమన్ ఇచ్చిన బీజీఎమ్ థియేటర్ లో కూర్చున్న ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఇప్పుడు స్కంద సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అసలే బోయపాటి నరుకుడు చూసి.. ఇదేం మాస్ సినిమారా? అని అనుకుంటుంటే.. తమన్ బాదుడుకు థియేటర్ ఊగిపోతోంది. థియేటర్లలో సౌండ్ సిస్టమ్స్ తట్టుకోవడం కష్టమని, యాజమాన్యం సైతం భయపడుతున్నారు అంటే స్కంద సినిమాకి థమన్ ఏ రేంజులో కొట్టాడో అర్ధం చేసుకోవచ్చు.

స్కంద సినిమా చూసిన బాలయ్య ఫ్యాన్స్ ఇప్పుడు స్కంద సినిమా గురించి కాకుండా భగవంత్ కేసరి గురించి ఆలోచిస్తున్నారు. స్కంద సినిమాకే ఇలా ఉంటే నెక్స్ట్ భగవంత్ కేసరి సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ రేంజులో ఉండబోతుందో ఊహించొచ్చు. నందమూరి అభిమానులకి పూనకాలని థియేటర్ లోనే తెప్పించే పనిలో ఉన్నాడు థమన్. బాలయ్య థమన్ అనగానే వీర సింహా రెడ్డి, అఖండ సినిమాలు ఆడియన్స్ కి గుర్తొస్తాయి. ఈసారి ఆ రెండు సినిమాలని మించి భగవంత్ కేసరి సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని థమన్ అదరగొట్టడం గ్యారెంటీ. మరి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నార్మల్ సీన్ ని కూడా ఎలివేట్ చేస్తున్న థమన్… ఈసారి భగవంత్ కేసరికి ఎలాంటి సెన్సేషనల్ స్కోర్ ఇస్తాడో చూడాలి.