Leading News Portal in Telugu

Leo: ఒక్క పోస్టర్ ఖరీదు 15 కోట్లా?


దళపతి విజయ్… డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ‘లియో’. దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మాస్టర్ సినిమాతో ఫ్లాప్ ఇచ్చినా కూడా విజయ్ లోకేష్ కలిసి సినిమా చేస్తున్నారు అంటేనే లియో సినిమాపై ఇద్దరికీ ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే మాస్టర్ సినిమా సమయంలో లోకేష్ కి ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉంది ఇప్పుడు లోకేష్ పాన్ ఇండియా హిట్ కొట్టిన దర్శకుడు… సో మాస్టర్ కన్నా డెఫినెట్ గా లియో బెటర్ ప్రాజెక్ట్ అవుతుంది. ప్రమోషన్స్ విషయంలో బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ వదులుతూ లియో ప్రాజెక్ట్ పై అంచనాలు మరింత పెంచుతున్న లోకేష్ కనగరాజ్… నెవర్ బిఫోర్ యాక్షన్ ఎక్ట్రావెంజాని చూపించబోతున్నాడు అనే విషయం అర్ధమవుతుంది. పోస్టర్స్ అన్నీ యాక్షన్ మోడ్ లోనే ఉన్నాయి దీంతో సినిమా ఎంత వయోలెంట్ గా ఉంటుంది అనే చర్చ మొదలయ్యింది.

లేటెస్ట్ గా వదిలిన ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ మాత్రం ఇండస్ట్రీ వర్గాలని కూడా షాక్ అయ్యేలా చేస్తుంది. విజయ్-వోల్ఫ్ మధ్య ఫైట్ ఎపిసోడ్ నుంచి రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఖరీదు 15 కోట్లు అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇండియన్ స్క్రీన్ పై ముందెన్నడూ చూడని ఒక హ్యుజ్ యాక్షన్ ఎపిసోడ్ ని చూపించబోతున్న లోకేష్… ఇందుకోసం 15 కోట్లు ఖర్చు చేయించాడని టాక్. ఒక్క ఫైట్ కోసం 15 కోట్లా అని కోలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. లియో పాన్ ఇండియా సినిమా కాబట్టి గ్రాఫిక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అందుకే CG ఇన్వాల్వ్ అయిన ఎపిసోడ్స్ ని కేర్ ఫుల్ గా షూట్ చేయాలి. ఇలాంటి సమయంలో అనుకున్న దాని కన్నా ఖర్చు ఎక్కువ అవ్వడం అనేది మాములే. ఆ ఫైట్ ఇంపాక్ట్ థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి ఏ రేంజులో ఉంటుందనే థియేటర్స్ లో చూడాలి.