Leading News Portal in Telugu

Sudheer Babu: మహేష్ మేనల్లుడు టాలీవుడ్ ఎంట్రీ.. దిమ్మతిరిగిపోవడం ఖాయం


Sudheer Babu: యంగ్ హీరో సుధీర్ బాబు ఒక భారీ హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాడు. ఇక ఈ ఏడాది వచ్చిన హంట్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మామ మశ్చీంద్ర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నటుడు, కమెడియన్ అయిన హర్షవర్ధన్ ఈ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో సుధీర్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఇషా రెబ్బ, మిర్నలిని రవి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేసిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో సుధీర్.. తన కొడుకు టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎలివేషన్స్ ఇచ్చి మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.

Malavika Mohanan: ఒక్క మాటతో ప్రభాస్ ఫ్యాన్స్ ను భలే బుట్టలో వేసుకుందే.?

సుధీర్ పెద్ద కొడుకు చరిత్ మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాల నటుడుగా సుధీర్ సినిమాల్లో నటిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్న చరిత్.. ప్రస్తుతం హీరోగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. చరిత్ ఇప్పటికే మహేష్ బాబు జిరాక్స్ కాపీ అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్న విషయం తెల్సిందే. ఇక ప్రస్తుతం అన్ని విద్యల్లో ప్రావీణ్యం పొందుతున్న చరిత్ మరో మూడేళ్ళలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సుధీర్ చెప్పుకొచ్చాడు. ” హీరో కావడానికి కావాల్సిన అన్ని రకాల ట్రైనింగ్స్ చరిత్ తీసుకుంటున్నాడు. సాలిడ్ గా కష్టపడుతున్నాడు. ఇలాగే హార్డ్ వర్క్ చేస్తే వాడిని ఎవరూ ఆపలేరు. మూడేళ్ళలో తుఫాన్ గ్యారెంటీ. అందరూ రెడీ అయిపోండి. కచ్చితంగా దిమ్మతిరిగిపోవడం ఖాయం అంటూ కొడుకు గురించి వేరే లెవెల్ ఎలివేషన్స్ ఇచ్చి సుధీర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి మహేష్ మేనల్లుడు ఏ రేంజ్ లో అదరగొడతాడో చూడాలి.