Leading News Portal in Telugu

Tollywood This Week: కిరణ్‌ అబ్బవరం vs ఎన్టీఆర్ బామ్మర్ది vs మహేష్ బాబు బావ!


సెప్టెంబర్ 28న స్కంద, పెదకాపు 1, చంద్రముఖి 2 రిలీజ్ అవ్వగా… ఈ వారం ఏకంగా అరడజను సినిమాలు దూసుకొస్తున్నాయి. అన్నీ కూడా మినిమమ్ బజ్ ఉన్న సినిమాలే కావడం విశేషం పైగా ఎన్టీఆర్ బామ్మర్ది, మహేష్ బాబు బావ కూడా ఈ రేసులో ఉండడంతో… ఈ వీక్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్‌తో పాటు… సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, శ్రీ గౌరి ప్రియ రెడ్డి కీలక పాత్రల్లో… కళ్యాణ్ శంకర్‌ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘మ్యాడ్‌’ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయిన మ్యాడ్ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మామా మశ్చీంద్ర’. సుధీర్ బాబు మూడు పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహించాడు. రీసెంట్‌గా మహేష్‌ రిలీజ్ చేసిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ రెండు సినిమాలు కూడా ఎన్టీఆర్, మహేష్‌ బాబు ప్రమోషన్స్‌తో థియేటర్లోకి రాబోతున్నాయి.

ఇక కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘రూల్స్ రంజన్’ ఈ వారమే థియేటర్లోకి రానుంది. నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను.. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పిస్తుండగా.. ఆయన తనయుడు రత్నంకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమా పై కూడా మంచి బజ్ ఉంది. కానీ మ్యాడ్, మామా మశ్చీంద్ర సినిమాల నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు. ఇక కలర్స్ స్వాతి రీ ఎంట్రీ ఇస్తూ.. నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో నటించిన ‘మంత్ ఆఫ్ మధు’, క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా తెరకెక్కిన 800 కూడా ఈ వారమే రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు సిద్ధార్థ్ నటించిన చిన్నా సినిమా కూడా విడుదల కానుంది. ఈ సినిమా ప్రెస్‌ మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు సిద్దార్థ్. మొత్తంగా ఈ వారం అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ చిన్న సినిమాల్లో ఏది పెద్ద విజయాన్ని అందుకుంటుందో చూడాలి.