Swades Actress Gayatri Joshi And Husband Vikas Oberoi Car Accident : షారుక్ ఖాన్ హీరోయిన్ గాయత్రి జోషి ఒక పెద్ద కారు ప్రమాదానికి గురైంది. ‘స్వదేస్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన గాయత్రీ జోషి కారు ప్రమాదానికి సంబంధించిన లైవ్ వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఒక క్యాంపర్ వ్యాన్ బోల్తా పడినట్టు కనిపిస్తోంది. అయితే ఈ ఘోర ప్రమాదంలో ఓ జంట ప్రాణాలు కోల్పోయిందని అంటున్నారు. గాయత్రి తన లాంబోర్గినీ కారులో భర్త వికాస్ ఒబెరాయ్‌తో కలిసి ప్రయాణిస్తోంది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఒక ఫెరారీ కారును ఢీ కొట్టి పక్కనే ఉన్న క్యాంపర్ వ్యాన్ ను ఢీ కొట్టింది. ఇక అందుతున్న సమాచారం మేరకు ఈ హృదయ విదారక ప్రమాదం ఇటలీలోని సార్డినియా ప్రాంతంలో జరిగిందని అంటున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఈ సంఘటన జరిగినప్పుడు, వెనుక నడుపుతున్న కారు నుండి వీడియో షూట్ చేయబడింది. ఈ వీడియోలో ముందు వెళ్తున్న మినీ ట్రక్కు వెనుక లగ్జరీ కార్లు ఒక్కొక్కటిగా వేగంగా కదులుతున్న క్రమంలో గాయత్రి కూడా తన లాంబోర్గినిలో తన భర్తతో వెళుతుండగా, వాటి వెనుక మరికొన్ని లగ్జరీ కార్లు ఒకదానికొకటిపోటీ పడటం కనిపించింది.
Gam Gam Ganesha: చిన్న దేవరకొండ ‘బృందావనివే’ సాంగ్ రిలీజ్ చేసిన రష్మిక మందన్న
అకస్మాత్తుగా, ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో, లంబోర్ఘిని కారు ఫెరారీని ఢీకొట్టింది, ట్రక్ రోడ్డు పైన గాలిలో బోల్తా పడడం కూడా కనిపిస్తుంది. ఫెరారీ కారు మంటల్లో చిక్కుకుంది, ఆ కారణంగా ఆ కారులో కూర్చున్న స్విస్ జంట అక్కడికక్కడే మరణించారు. ఇక ఈ ప్రమాదంలో గాయత్రి, ఆమె భర్త క్షేమంగా ఉన్నారని చెబుతున్నారు. నివేదికల ప్రకారం, ఒక వార్తా వెబ్‌సైట్‌తో గాయత్రి మాట్లాడుతూ వికాస్, నేను ఇటలీలో ఉన్నాము, ఇక్కడ ప్రమాదానికి గురయ్యాము అయితే దేవుని దయతో మేము పూర్తిగా బాగున్నామని అన్నారు. గాయత్రీ జోషి 2004లో ‘స్వదేస్’ సినిమాతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది, ఈ సినిమాలో షారుక్ ఖాన్ పక్కన ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత, ఆమె నటనకు దూరంగా ఉంది. ఒబెరాయ్ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఒబెరాయ్‌ను వివాహం చేసుకుని విదేశాలకు వెళ్లి సెటిల్ అయింది.