Leading News Portal in Telugu

Prema Vimanam Trailer: ఇదేదో.. విమానం సినిమాకు సీక్వెల్ లా ఉందే..?


Prema Vimanam Trailer: దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, సంగీత్ శోభన్, సాన్వీ మేఘన, అనసూయ భరద్వాజ్ మరియు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో సంతోష్ కాటా దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ ఫిల్మ్ ప్రేమ విమానం. ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నాడు. ఈ వెబ్ ఫిల్మ్ అక్టోబర్ 13 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ను బట్టి ఈ సినిమా కూడా దాదాపు విమానం సినిమాను పోలి ఉంది. విమానం ఎక్కాలని ఇద్దరుపిల్లలు ఏం చేశారు అనేది కథగా తెలుస్తోంది. ఇక ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అనసూయ, రవివర్మ కు ఇద్దరు పిల్లలు.. కూలీ చేస్తే తప్ప వారికి కడుపు నిండదు. ఇంకోపక్క పెద్దింటి అమ్మాయి అయిన సాన్వీని సంగీత్ ప్రేమిస్తాడు.. ఇలా రెండు కథలను కలుపుతూ ఈ సినిమా సాగుతుందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

Nandamuri Balakrishna: చంద్రబాబు అరెస్ట్.. ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్..

విమానం ఎక్కడానికి ఇద్దరు పిల్లలు.. కొంత డబ్బు కూడబెట్టుకొని పట్నం వస్తారు. అక్కడ వారు ఎదుర్కున్న పరిస్థితిలు ఏంటి.. మూడు రోజుల గడువులో వీరి జీవితాలు ఎలా మారాయి.. చివరికి ఆ చిన్నారుల ఆశ తీరిందా.. ? అనేది సినిమాలోనే చూడాలి. ఇంచుమించుగా ఈ సినిమా కూడా సముద్రఖని విమానం సినిమాను గుర్తుచేస్తోంది. అందులో కేవలం తండ్రి ప్రేమను మాత్రమే హైలైట్ గా చూపించారు. ఇందులో మరో రెండు కథలను యాడ్ చేశారు. మరి ప్రేమ విమానం ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.