Leading News Portal in Telugu

Guess Who: అక్కడ టాటూ చూపించి టెంప్ట్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో చెప్పండి..?


Guess Who: దీప్తి సునైనా.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారందరికి అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. టిక్ టాక్స్ లో ఫేమస్ అయ్యి.. బిగ్ బాస్ వరకు వెళ్ళింది. నాని హోస్ట్ చేసిన సీజన్ లో దీప్తి కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళింది. ఇక ఇప్పుడు ప్రియాంక ఎలా అయితే హెయిర్ కట్ టాస్క్ బిగ్ బాస్ పెట్టాడో.. అది మొదలైందే దీప్తితో అని చెప్పాలి. దీప్తి.. మరో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ప్రేమలో మునిగితేలిన విషయం తెల్సిందే. ఇక షన్ను బిగ్ బాస్ కు వెళ్లే కొన్నిరోజుల ముందు వీరు పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పుకొచ్చారు. కానీ, షన్ను బిగ్ బాస్ నుంచి రావడమే.. తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఇక అప్పటినుంచి ఎవరి కెరీర్లను వారు సెట్ చేసుకొనే పనిలో పడ్డారు. దీప్తి.. సోషల్ మీడియాలో చేసే హల్చల్ అంతాఇంతా కాదు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కనిపిస్తూనే.. ఇంకోపక్క అందాల ఆరబోత చేస్తూ అభిమానులను బాగానే అలరిస్తోంది.

Kasthuri Shankar: గంటకు ఐదు వేలు వస్తాయ్.. నీకెందుకు బిగ్ బాస్

తాజాగా దీప్తి చీరకట్టులో అదరగొట్టింది. మెరూన్ కలర్ చీరలో అమ్మడు మెరిసిపోయింది. ముఖ్యంగా బ్యాక్ నెక్ పై టాటూ చూపిస్తూ.. హెయిర్ ను బన్ లా పెట్టి.. వీపందాన్ని, నడుము మడతలను ఓ రేంజ్ లో చూపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. కొంతమంది సూపర్ అంటుండగా.. ఇంకొంతమంది.. అవకాశాల కోసం అందాల ఆరబోతనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు ఈ భామ ఏదైనా సినిమాలో కనిపిస్తుందేమో చూడాలి.