Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లియో సినిమా గురించే ట్విట్టర్ లో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇక దీంతో అందరి చూపు లియో మీదనే ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సరసాబా త్రిష నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 5 న లియో ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా సెన్సార్ ను పూర్తిచేసుకుంది చిత్రబృందం తెలిపింది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని మేకర్స్ తెలిపారు.
Guess Who: అక్కడ టాటూ చూపించి టెంప్ట్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో చెప్పండి..?
ఇక సెన్సార్ సభ్యులు తెలిపినది ప్రకారం.. కొన్ని సీన్స్ లో విజయ్ యాక్టింగ్ వేరే లెవెల్ అని, ఆయన కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో లియో ఉంటుందని సమాచారం. దీంతో ఈ సినిమాపై అభిమానులు మరింత అంచనాలను పెంచేసుకున్నారు. లియో సినిమాలో విజయ్ కు ధీటుగా విలనిజాన్ని పండించడానికి స్టార్ హీరోలను దింపాడు లోకేష్. ఇప్పటికే.. విజయ్, సంజయ్ దత్ ఢీ కొడుతున్న పోస్టర్ ను రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశాడు. ఇక సంజయ్ దత్ మాత్రమే కాకుండా అర్జున్ సర్జా, అర్జున్ దాస్ లాంటి విలన్స్ కూడా ఉన్నారు. అంతేకాకుండా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో లియో కూడా ఉందని, రోలెక్స్ కు సంబంధించిన పాత్ర కూడా ఇందులో చూపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే.. అక్టోబర్ 19 వరకు ఆగాల్సిందే.