Leading News Portal in Telugu

Ayalaan : టీజర్ రన్నింగ్ టైం గురించి క్లారిటీ ఇచ్చిన మేకర్స్..


కోలీవుడ్‌ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అయలాన్.శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. రీసెంట్ గా మేకర్స్‌ లాంఛ్ చేసిన అయలాన్ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌లో బాగా వైరల్ అయింది. ఈ పోస్టర్ లో ఆకాశంలో విహారిస్తున్న శివ కార్తికేయన్ అతడితో పాటే ఓ ఏలియన్‌ కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. అయలాన్ చిత్రానికి ఆర్‌ రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.తాజాగా టీజర్‌ అప్‌డేట్ అందించి ప్రేక్షకులకు ఆసక్తి కలిగించింది చిత్ర యూనిట్… అక్టోబర్ 6న ఈ సినిమా టీజర్ లాంఛ్ కానుండగా..తాజాగా టీజర్ రన్నింగ్ టైం ఎంతో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్‌. తాజా అప్‌డేట్ ప్రకారం టీజర్ టైం 2 నిమిషాల 8 సెకన్లు. అంటే దాదాపు ట్రైలర్‌ కు వున్న నిడివి ఉన్నట్లు తెలుస్తుంది.. టీజర్‌లో ట్రైలర్‌ చూపించేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు…

అంతేకాదు అక్టోబర్ 5 న  విజయ్ దళపతి లియో ట్రైలర్‌ కూడా రిలీజ్ కానుంది. దీనితో లియో టీజర్ తో కలిసి థియేటర్లలో సందడి చేయనుందట అయలాన్‌ టీజర్‌.అయలాన్ చిత్రాన్ని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సినిమాలో శివకార్తికేయన్ డిఫరెంట్‌ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. మ్యూజిక్‌ సెన్సేషన్‌, ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో అయలాన్‌ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.అయలాన్‌ సినిమా లో శరద్‌ కేల్కర్‌, ఇషా కొప్పికర్‌, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్‌, బాల శరవణన్‌ ఇతర నటినటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శివకార్తికేయన్ అయలాన్ సినిమాతో పాటు రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. SK21 వర్కింగ్ టైటిల్ తో గా వస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.