Leading News Portal in Telugu

Saindhav : మాసివ్ అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్..


టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. హిట్ సిరీస్ ఫేం శైలేష్‌ కొలను ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. ఈ యంగ్ దర్శకుడు సినిమా ను యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిస్తున్నాడు.తాజాగా ఓ సస్పెన్స్‌ అప్‌డేట్‌ ను ఇవ్వబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.టాలీవుడ్‌ లో సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉన్న హీరోల్లో టాప్‌ లో వెంకటేష్ ఉంటారు. సైందవ్ సినిమా వెంకటేశ్‌ 75 వ సినిమాగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఓ సస్పెన్స్‌ అప్‌డేట్‌ను రేపు ఉదయం 11:07 గంటలకు ఇవ్వబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు.. ఇంతకీ రేపు ఏం అప్డేట్ ఇవ్వనున్నారు అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.చంద్ర ప్రస్థ ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మిషన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న సైంధవ్‌ సినిమా లో జెర్సీ మూవీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాశ్‌ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు.ఈ సినిమా లో ఇప్పటికే విడుదల చేసిన శ్రద్ధా శ్రీనాథ్‌ మనోజ్ఞ లుక్‌ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.సైంధవ్‌లో రుహానీ శర్మ డాక్టర్‌ గా కనిపించనుండగా.. నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో కనిపించబోతున్నాడు. కోలీవుడ్‌ యాక్టర్ ఆర్య మానస్ పాత్ర లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన సైంధవ్‌ గ్లింప్స్ వీడియో సినిమాపై భారీ గా అంచనాలు పెంచేస్తోంది. సైంధవ్‌.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 2023 డిసెంబర్‌ 22 న ప్రపంచవ్యాప్తం గా ఎంతో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ పై వెంకట్‌ బోయనపల్లి తెరకెక్కిస్తుండగా సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.

https://x.com/KolanuSailesh/status/1709517753135374470?s=20