Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగు తెలుగు పరిచయం అయిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ కుర్రకారు మనసుల్లో సీతగా మిగిలిపోయింది. ఈ సినిమా చూసిన తర్వాత టాలీవుడ్ ఈ భామ ఇండస్ట్రీని ఏలేస్తుంది అని అనుకున్నారు. కానీ, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్న చందానా.. ప్రగ్యా కంచె తర్వాత అలాంటి హిట్ ను మాత్రం అందుకోలేకపోయింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగైదు సినిమాల వరకు కూడా ఈ భామ హిట్ కాదు కదా కనీసం మంచి హీరోయిన్ ఛాన్స్ కూడా అందిపుచ్చుకోలేకపోయింది. ఇక ఎట్టకేలకు చాలా ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాతో ప్రగ్యా మరో విజయాన్ని అందుకుంది. సరే ఈ సినిమా తర్వాత అయినా ప్రగ్యాకు అవకాశాలు వదలకుండా వస్తాయని అనుకున్నారు. కానీ ఇది కూడా రాంగ్ అయ్యింది. సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటుతుంది ఇప్పటివరకు ఈ భామ మరో సినిమాలో కనిపించింది లేదు.
Lucifer 2: లూసిఫర్ సీక్వెల్ తో వస్తున్నాడు.. మరి గాడ్ ఫాదర్..?
ఇక సినిమాలో కనిపించకపోయినా సోషల్ మీడియాలో ప్రగ్యా చేసే అందాల ఆరబోత అంతాఇంతా కాదు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ కుర్రకారును మత్తెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ మరోసారి సోషల్ మీడియాను హీటెక్కిచ్చింది. బ్లాక్ కలర్ స్విమ్ సూట్ వేసుకొని దానిపై బ్లాక్ డెనిమ్ జాకెట్ తో అదరగొట్టింది. ముఖ్యంగా థైస్ ఎలివేషన్ వేరే లెవెల్ లో ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. దీంతో ఈ భామ ఇంతగా అందాలు ఆరబోస్తున్నా అవకాశాలు ఎందుకు రావట్లేదు అని ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు ప్రగ్యా ఏమైనా సినిమాల్లో చేస్తుందా లేకపోతే ఇలాగే ఫోటోషూట్స్ కంటిన్యూ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.