Leading News Portal in Telugu

Narne Nithin: ఎప్పుడూ నాకు సపోర్ట్ గా ఉన్నారు… థాంక్యూ బావ!


Narne Nithin intresting comments on NTR at MAD Prerelease Event: ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న ఈ సినిమాని ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషించారు. బుధవారం సాయంత్రం మ్యాడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగగా అందులో భాగంగా నార్నే నితిన్ మాట్లాడుతూ ముందుగా మా దర్శకుడు కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలని అన్నారు.

Rathinirvedam: శృంగారభరిత ‘రతి నిర్వేదం’ రీ రిలీజ్.. ఎప్పుడంటే?

మేమేదో పని చేయడానికో, షూట్ కో వెళ్తున్నట్టు ఏ రోజు కూడా మాకు అనిపించలేదని, ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఆయన నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ ఉన్నారని అన్నారు. నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు కళ్యాణ్ కి థాంక్స్ చెప్పిన ఆయన ఈ సినిమాని మొదటి నుంచి నమ్మి ఇంత గ్రాండ్ గా నిర్మించినందుకు చినబాబు, వంశీ, హారికకి థాంక్స్ చెప్పుకుంటున్నానని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ బావ గురించి మాట్లాడుకోవాలి, బావకి థాంక్స్ చెప్పుకోవాలి. ఈరోజు మాకు ఇంత సపోర్ట్ ఉంది, మాకు ఇంతమంది బ్లెస్సింగ్స్ ఉన్నాయంటే ఆయన వల్లేనని ఎప్పుడూ నాకు సపోర్ట్ గా ఉన్నారని అన్నారు. థాంక్యూ బావ అంటూ నార్నె నితిన్ కామెంట్ చేశారు.