Ayalaan Teaser: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అయిలాన్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇప్పటివరకు ఏలియన్స్ సినిమాలను ఇంగ్లీష్, హిందీ సినిమాల్లోనే చూసాం. మొదటి సారి శివ కార్తికేయన్ తమిళ్ లో ప్రయోగం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తెలుగులో అదే పేరుతో డబ్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయ. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక సాధారణ రైతుగా శివ కార్తికేయన్ కనిపించాడు. డబ్బు కోసం, పేరు కోసం.. ఒక విలన్ తన ల్యాబ్ లో తయారుచేసిన ప్రయోగం వలన వాతావరణంలో మార్పులు వస్తాయి. వాటి వలన భూమే అంతం అయ్యే పరిస్థితి వస్తుంది.
Raakshasa Kaavyam: ఎప్పుడూ హీరోలే ఎందుకు గెలవాలి..విలన్లు కూడా గెలవాలి కదా!
ఇక ఆ మార్పుల వలన.. ఒక ఏలియన్.. భూమి మీదకు వస్తుంది. అది.. శివ కార్తికేయన్ తో కలిసి ఉంటుంది. అసలు ఏలియన్ వచ్చిన పని ఏంటి.. ? ఏలియన్ తో కలిసి హీరో.. ఆ ప్రయోగాన్ని అడ్డుకున్నాడా.. ? భూమి అంతం అవ్వకుండా ఆపాడా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే.. మ్యూజిక్ మరో ఎత్తు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. అతీంద్రయ శక్తులు కూడా ఇందులో ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఏలియన్ తో శివ కార్తికేయన్, యోగిబాబు చేసిన కామెడీ సినిమాకు ప్లస్ గా మారుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.