Leading News Portal in Telugu

Tollywood: అన్నలు హీరోలు.. తమ్ముళ్లు కమెడియన్స్



Naresh

Tollywood: సాధారణంగా ఏ కుటుంబంలోనైనా పెద్ద అబ్బాయి కష్టపడతాడు.. రెండో అబ్బాయి ఎంజాయ్ చేస్తాడు అని అంటారు. అన్నను చూసే తమ్ముడు చాలా నేర్చుకుంటాడు. వారిద్దరూ ఎంత కొట్టుకునా ఒకరినొకరు సపోర్ట్ చేసుకొంటూనే ఉంటారు. అదే అన్నదమ్ముల అనుబంధం. ఇక అన్న ఒక రంగంలో సక్సెస్ అయితే.. తమ్ముడు అదే రంగంలోకి రావాలని చూస్తాడు. ముఖ్యంగా ఆ రంగం చిత్ర పరిశ్రమ అయితే తప్పకుండా వస్తారు. ఇప్పటివరకు చాలామంది హీరోలు అలానే వచ్చారు కూడా. అయితే అన్న హీరో అయితే.. తమ్ముడు కూడా హీరోగా రావడం చూసాం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్.. హరికృష్ణ తమ్ముడు బాలకృష్ణ, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇలా.. హీరోలుగా సక్సెస్ అయిన అన్నలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని తమ్ముళ్లు కూడా హీరోలుగా మారారు. అయితే కొంతమంది మాత్రం.. అన్న హీరో గా సెటిల్ అయితే.. తమ్ముడు కమెడియన్ గా మారారు.

SS.Rajamouli: సుమ కొడుకు బబుల్ గమ్ అంటున్న జక్కన్న

డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్. హయ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత వరుసగా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక అన్న సక్సెస్ తరువాత నరేష్ .. అల్లరి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అన్నలా కాకుండా కామెడీని నమ్ముకొని కామెడీ హీరో అయ్యాడు. ఇప్పుడిప్పుడే ఆ పంధా నుంచి బయటపడుతున్నాడు. ఇక ఈ జనరేషన్ లో మరో అల్లరి నరేష్ లా మారాడు సంగీత్ శోభన్. డైరెక్టర్ శోభన్ పెద్ద కొడుకు సంతోష్ శోభన్. బాల నటుడిగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన సంతోష్ పేపర్ బాయ్ సినిమాతో హీరోగా మారాడు. మరి అంత సక్సెస్ ను అందుకోకపోయినా.. తనకంటూ ఒక గుర్తింపు అందుకున్నాడు. ఇక అన్న ఎంట్రీ తరువాత సైలెంట్ గా సంతోష్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అన్నలా హీరోగా కాకుండా కమెడియన్ గా మారాడు. తనదైన కామెడీ టైమింగ్ తో రెచ్చిపోతున్నాడు. ఇక ఈరోజు రిలీజ్ అయిన మ్యాడ్ సినిమాతో అతని కామెడీ టైమింగ్ ఏంటి అనేది జనాలు మరోసారి చూసారు. ఇక అతడి కామెడీ చూసి.. ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు సంగీత్.. అన్న కన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్నా ఆశ్చర్యం లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు.