Leading News Portal in Telugu

Raviteja: టైగర్ నాగేశ్వరరావు కొత్త ప్రయోగం..మొట్టమొదటి సారిగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో!


Tiger Nageswara Rao Will Also Release In Indian Sign Language On October 20th: మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. నిజానికి ఈ సినిమాను స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమాలు ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌పై భారీగా ఖర్చు చేస్తూ, సినిమాపై ఉత్సాహం నింపేందుకు నిర్మాత అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పటికే మేకర్స్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో కూడా ట్రైలర్‌ను విడుదల చేశారు.

Leo movie: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అంటున్న నాగవంశీ!

ఆ వీడియోలో ఒక యాంకర్ క్లిప్‌ కంటెంట్‌ను వివరిస్తున్న విషయం వైరల్ అయింది. భారతదేశంలోనే సైన్ భాషలో విడుదలైన తొలి ట్రైలర్ ఇదే కాగా ఇప్పుడు అక్టోబర్ 20న ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో కూడా సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత అనౌన్స్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో విడుదలైయ్యే మొదటి ఇండియన్ మూవీగా నిలవనుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రెండు పాటలను ఇప్పటికే విడుదల చేయగా ఆ రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి ఆర్‌ మదీ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ గా వ్యవరిస్తున్నారు. ఇక టైగర్ నాగేశ్వరరావు దసరా సందర్భంగా అక్టోబర్ 19న అన్ని దక్షిణాది భాషలు సహా హిందీలో విడుదల కానుండగా ఒకరోజు ఆలస్యంగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది.