Leading News Portal in Telugu

MAD Collections: చిన్న సినిమా పెద్ద హిట్… డే 1 కలెక్షన్స్ మాములుగా లేవు


స్టార్ హీరోలతో భారీ బడ్జట్ సినిమాలు చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన చిన్న సినిమా ‘మ్యాడ్’. కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా సితారా బ్యానర్ కి సాలిడ్ డబ్బులు ఇచ్చేలా కనిపిస్తుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన మ్యాడ్ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ట్రైలర్ లోని డైలాగ్స్ ని రెగ్యులర్ గా వాడేస్తున్న యూత్, మ్యాడ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేసారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ మ్యాడ్ సినిమా నిన్న ఆడియన్స్ ముందుకి వచ్చింది.

ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడం, కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సినిమా అనే పేరు తెచ్చుకోవడం, ముగ్గురి స్నేహితుల జర్నీ ఈ సినిమా అని వినిపించడంతో మ్యాడ్ సినిమాని చూడడానికి యూత్ థియేటర్స్ కి వెళ్లిపోయారు. దీంతో డే 1 మ్యాడ్ మూవీ 1.8 కోట్లని రాబట్టింది. ఈరోజు, రేపు హాలిడేస్ కాబట్టి మ్యాడ్ సినిమా కలెక్షన్స్ లో మంచి జంప్ కనిపించే అవకాశం ఉంది. అక్టోబర్ 19 వరకూ మ్యాడ్ సినిమాని ఆపే మూవీ లేదు కాబట్టి లాంగ్ రన్ లో మ్యాడ్ సాలిడ్ నంబర్ ని పోస్ట్ చేయడం గ్యారెంటీ.