Leading News Portal in Telugu

Vijay Antony Daughter: నీ ఆలోచనలతో చచ్చిపోతున్నా.. నువ్వు లేకుండా ఉండలేను!


Vijay Antony Wife fathima Heart felt note for her daughter: విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా ఆంటోనీ కొన్ని రోజుల క్రితం ఒత్తిడి తదితర కారణాల వలన ఆత్మహత్య చేసుకుని మరణించింది. కేవలం 16 ఏళ్ళ వయసులో ఆమె అనూహ్యంగా చావు ఒడికి చేరింది. ఇక ఆమె మరణంతో అటు విజయ్ ఆంటోనీ, ఆయన కుటుంబం చాలా విషాదంలో ఉంది. నిజానికి ఆమె ఆత్మహత్య అనంతరం రకరకాల వార్తలు కూడా వచ్చాయి కానీ దాదాపుగా ఆమె ఒత్తిడి తట్టుకోలేకనే చనిపోయినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక ఆమె మరణానంతరం మరో కుమార్తె లారా ఆంటోనీని తాము వెళుతున్న అన్ని చోట్లకు తీసుకు వెళుతున్నారు విజయ్ ఆంటోనీ దంపతులు. విజయ్ ఆంటోనీ ఒక పక్క హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా ఉండగా ఆయన భార్య ఫాతిమా ఆంటోనీ కూడా విజయ్ ఆంటోనీ సొంత నిర్మాణ సంస్థ బాధ్యతలు స్వీకరించి అన్నీ తానై నడిపిస్తోంది.

Pooja Hegde: మరోసారి మెగా ఆఫర్ పట్టేసిన బుట్టబొమ్మ.. ?

ఇక కుమార్తె మరణం నేపథ్యంలో ఫాతిమా ఆంటోనీ ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశారు. నువ్వు కేవలం 16 ఏళ్లు మాత్రమే జీవిస్తావని నాకు తెలిస్తే, నిన్ను నాకు చాలా దగ్గరగా ఉంచుకునే దాన్ని అని అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. నిన్ను సూర్యచంద్రులకు కూడా చూపించకుండా నిన్ను నేను దాచుకునే దాన్ని ఇప్పుడు నువ్వు లేక నేను నీ ఆలోచనలలో మునిగిపోయి చచ్చిపోతున్నాను, నువ్వు లేకుండా ఉండలేనని అంటూ కుమార్తెను గుర్తు చేసుకుంది. అంతేకాక అమ్మ నాన్న దగ్గరకి తిరిగి వచ్చేయ్ అమ్మా, లారా(నీ చెల్లి) నీ కోసం ఎదురుచూస్తూనే ఉంది, లవ్ యు తంగం అని అంటూ ఆమె రాసుకొచ్చారు. ఇక తన ఫోన్ లో ఉన్న ఒక మీరా ఆంటోనీ ఫోటోను కూడా ఫాతిమా షేర్ చేశారు.