Leading News Portal in Telugu

Niharika Konidela: మెగా డాటర్ లోతైన కళ్ళలో దాగున్న రహస్యాలు ఎన్నో..


Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా కెరీర్ మొదలుపెట్టిన విషయం తెల్సిందే. నటిగా కెరీర్ లో ఎదగడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా నిహారిక ముందుకు సాగుతోంది. ఇక చైతన్య జొన్నలగడ్డతో విడాకులు అయ్యిన దగ్గరనుంచి ఆమె సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. అందాల ఆరబోతకు సై అంటూ.. వరుస ఫోటోషూట్స్ తో అదరగొడుతుంది. రెండు వారాల క్రితం కుటుంబంతో కలిసి వెకేషన్ లో విదేశాల్లో ఎంజాయ్ చేసిన ఈ భామ.. అన్న వరుణ్ తేజ్ పెళ్లి పనులు చూసుకోవడానికి ఇండియా వచ్చింది. ఈ మధ్యనే మెగా ఇంట వరుణ్ – లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీ గ్రాండ్ గా నిర్వహించారు. ఇక నిత్యం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న నిహారిక .. మరోసారి తన హాట్ ఫోటోషూట్ తో కుర్రకారును మత్తెక్కించింది. ఆరెంజ్ కలర్ స్వెట్ టీ షర్ట్ లో ముద్దుగుమ్మ అదిరిపోయింది.

Suryadevara Harika: నిర్మాత అంటే ఏమో అనుకున్నాం కానీ భయ్యా.. హీరోయిన్ లా ఉందే

లెగ్స్ కనిపించకుండా దిండును కవర్ చేసి.. హెయిర్ తో మెస్మరైజ్ చేసింది. ఇక చిలిపిగా నవ్వుతూ కనిపించినా.. ఆమె కత్తిలాంటి చూపులతో కనిపించినా కూడా ఎంతో అందంగా ఉంది. ముఖ్యంగా ఆ కళ్లు.. ఏదో దాస్తున్నట్లు కనిపిస్తున్నాయని, లోతైన కళ్ళలో దాగున్న రహస్యాలు ఎన్నో అని నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే .. నిహారిక కమ్ బ్యాక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి మెగా డాటర్ మంచి హిట్ తో వస్తుందేమో చూడాలి.