Bubblegum Teaser: యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం బబుల్ గమ్. రవికాంత్ పేరుపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ సరసన మానస చౌదరి నటించింది. ఇక ఈ సినిమాను
మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఇక టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. టీజర్ ను బట్టి రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఆదిత్య.. ఒక పబ్ లో డీజే. డబ్బు లేదు.. అయినా కూడా ఏదో సాధించాలని తిరుగుతూ ఉంటాడు. ఇక ఒకరోజు పబ్ లో జాన్వీని కలుస్తాడు. వీరిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇక మధ్యలో వీరి మధ్య గొడవలు మొదలవుతాయి. అయితే వారిద్దరి ఆమధ్య గొడవలు మొదలవుతాయి. అయితే అవి ఎందుకు అనేవి చూపించలేదు కానీ, ఆ ప్రేమ కోసం అతడు ఎక్కడివరకు వెళ్ళాడు అనేది కథగా తెలుస్తోంది.
Ram Charan: లియోను లేపడానికి.. చరణ్ పేరును వాడుతున్నారు కదరా..?
ఇక మొదటి సినిమాలోనే రోషన్ చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు. టీజర్ లో కొత్త హీరో అనే ఫీల్ రానివ్వలేదు. రోషన్ తన మొదటి సినిమాలోనే హీరోయిన్ తో లిప్ లాక్ తో అదరగొట్టేశాడు. అంతేకాకుండా బూతులు కూడా గట్టిగానే వాడినట్లు తెలుస్తోంది. టీజర్ లో శాంపిల్ కు కొన్ని ఘాటు పదాలు కూడా చూపించారు. టీజర్ తో సినిమాపై హైప్ ను క్రియేట్ చేశారు. మరి మొదటి సినిమాతో రోషన్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.