Leading News Portal in Telugu

Divya Prabha: విమానంలో నటికి లైంగిక వేధింపులు..మద్యం మత్తులో అసభ్య ప్రవర్తన?


Malayalam actor Divya Prabha alleges harassment by drunk passenger in flight:
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎన్ని చట్టాలు చేస్తున్న దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై వేధింపుల ఘటనలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు సామాన్యులకు జరిగిన ఘటనలు బయటకు వచ్చేవి కాదు కానీ సోషల్ మీడియా దెబ్బతో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా మలయాళ నటి దివ్యప్రభ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. తాను ప్రయాణిస్తున్న విమానంలో తన తోటి ప్రయాణికుడి నుంచి వేధింపులను ఎదుర్కొన్నట్లు దివ్య ప్రభ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్టోబర్ 9న ముంబై నుంచి కొచ్చి వెళ్లే ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ 681లో తన తోటి ప్రయాణికుడు తనను వేధించాడని కేరళ పోలీసులకు దివ్య ప్రభ ఫిర్యాదు చేసి ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.

Aamir Khan: స్టార్ హీరో ఇంట పెళ్లి భాజాలు.. కూతురు వెడ్డింగ్ డేట్ అనౌన్స్ చేసిన అమీర్ ఖాన్!

ఎయిర్‌హోస్ట్‌స్‌కు రిపోర్టు చేసినప్పటికీ వారు విమానం టేకాఫ్‌ అయ్యే ముందు తనను వేరే సీటుకు మార్చడం తప్ప ఎలాంటి చర్యలు అతని మీద తీసుకోలేదని దివ్య ప్రభ పేర్కొన్నారు. ఈ విషయంపై కొచ్చి విమానాశ్రయంలో దిగిన తర్వాత ఎయిర్‌లైన్స్-ఎయిర్ పోర్ట్ అధికారులకు రిపోర్ట్ చేసినా వారు నన్ను విమానాశ్రయంలో పోలీసు హెల్ప్ డెస్క్ కి వెళ్లమని చెప్పారని దివ్య ప్రభ తెలిపారు. వేధింపులకు సంబంధించి పోలీసులకు చేసిన అధికారిక ఫిర్యాదుతో పాటు తన విమాన టికెట్‌ను కూడా దివ్య ప్రభ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నేను విమానంలో 12ఏ సీటులో ఉన్నా, 12 సీలో కూర్చున్న ప్రయాణికుడు మద్యం మత్తులో ఉండి సీటును నా పక్కన ఉండే 12 బీకి మార్చుకున్నాడు. ఆ తర్వాత సీటు మార్పుకు సంబంధించి ఎటువంటి లాజిక్ లేకుండా నాతో వాదనకు దిగి శారీరకంగా తాకడం సహా తప్పుగా ప్రవర్తించాడని అనూ దివ్య ప్రభ తన ఫిర్యాదులో రాసుకొచ్చారు. మరి అధికారులు ఈ ఘటన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.