Leading News Portal in Telugu

Chiranjeevi: బిగ్ బి కి సర్ ప్రైజ్ ఇచ్చిన చిరు.. వీడియో వైరల్


Chiranjeevi: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు మెగాస్టార్ చిరంజీవి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. నేడు అమితాబ్ పుట్టినరోజు అన్న విషయం తెల్సిందే. ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అమితాబ్ బర్త్ డే విషెస్ తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఇక ఇప్పటికే ట్విట్టర్ ద్వారా చిరు.. అమితాబ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. “గురూజీ.. మీకు 81వ జన్మదిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో, సంతోషం నిండిన దీర్ఘాయువుతో ఆశీర్వదించబడాలి. మీ నటన, ప్రతిభా పాటవాలతో, అనేక సంవత్సరాల పాటు మీరు లక్షలాది మందిని ఆకట్టుకుని స్ఫూర్తినిస్తూనే ఉండండి. ఈ మీ పుట్టినరోజు కూడా నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మీ కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోలో ఈ రోజు రాత్రి వర్చువల్‌గా నా ఆరాధ్యదైవమైన మిమ్మల్ని కలిసేందుకు నేను ఎదురు చూస్తున్నాను” అని రాసుకొచ్చారు.

ఇక చెప్పినట్లుగానే కౌన్‌ బనేగా కరోడ్‌పతి షో లో చిరు సర్ప్రైజ్ ఇచ్చారు. షో జరుగుతున్న మధ్యలో ఒక వీడియో ద్వారా చిరు మాట్లాడుతూ.. ” ప్రణామమ్ అమిత్ జీ.. ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అమిత్ జీ.. నాకెంతో కావాల్సినవారు. ఆయన మాటలు నన్నెంతో స్ఫూర్తిపొందేలా చేసాయి. హ్యాపీ బర్త్ డే అమిత్ జీ” అంటూ చెప్పారు. ఇక ఇది ఊహించని అమితాబ్ షాక్ అయ్యారు. చిరు చెప్పిన మాటలకు అమితాబ్ కంటతడి పెట్టుకొని.. థాంక్యూ చిరు సర్ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అమితాబ్, చిరు కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రంలో కలిసి నటించారు.