Leading News Portal in Telugu

Kannappa : కన్నప్ప సినిమా లో నటించబోతున్న శివరాజ్ కుమార్..?


Kannappa : కన్నప్ప సినిమా లో నటించబోతున్న శివరాజ్ కుమార్..?

టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.భారీ తారాగణం తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా గా ఈ సినిమా తెరకెక్కుతుంది.. న్యూజిలాండ్‌ లో ఇటీవలే కన్నప్ప షూటింగ్ కూడా ప్రారంభం అయింది..పలువురు పాన్ ఇండియా హీరోలు ఈ సినిమా లో భాగస్వామ్యం కాబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మరో పాన్ ఇండియా స్టార్ కూడా కన్నప్పలో నటించబోతున్నాడనే వార్త తెగ వైరల్ అవుతుంది.ఆ పాన్ ఇండియా స్టార్ ఎవరో కాదు..ఇటీవలే జైలర్‌ లో నరసింహ పాత్ర లో  నటించిన శివరాజ్‌కుమార్‌. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర లో కనిపించబోతున్నాడన్న వార్త తెగ వైరల్ అవుతుంది.. ఈ క్రేజీ వార్తల పై మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే లేదు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, నయనతార, మధుబాల కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే అప్‌డేట్స్ కూడా వచ్చాయి.తాజాగా ఈ కన్నడ సూపర్ స్టార్ కూడా కన్నప్ప టీంతో జాయిన్ కాబోతున్నాడన్న వార్తలతో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి.. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అలాగే స్టీఫెన్‌ దేవసి మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందించనున్నారు. రానున్న రోజుల్లో కన్నప్ప సినిమా నుంచి మరిన్ని సర్ప్రైస్ లు అందించనుంది మంచు విష్ణు టీం.అయితే ఈ సారి మంచు విష్ణు కన్నప్ప వంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల చాలా గట్టిగా ఫిక్సయినట్టు వరుస అప్డేట్స్ తోనే తెలుస్తుంది. మరి ఈ సినిమా తో విష్ణు కెరీర్ బెస్ట్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.