Leading News Portal in Telugu

Jawan: రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా.. ఓటిటీలోకి వచ్చేస్తుంది..?


Jawan: రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా.. ఓటిటీలోకి వచ్చేస్తుంది..?

Jawan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుక్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను అందుకొని భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటివరకూ వరల్డ్ వైడ్ గా 1100 కోట్లని రాబట్టింది. నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తున్న జవాన్ సినిమా, ముప్పై రోజులు అవుతున్నా థియేటర్స్ లో సూపర్ స్ట్రాంగ్ గా రాక్ సాలిడ్ గా నిలబడింది. ఇప్పుడు కూడా చాలా ఏరియాస్ లో జవాన్ హౌస్ ఫుల్ అవుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు అవుతుంది. ఎప్పుడెప్పుడు జవాన్ ఓటిటీలోకి వస్తుందా అని.. షారుక్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Tiger NageswaraRao: టైగర్.. రవితేజకు ఇంత స్పెషల్ అని అనుకోలేదే.. భలే ఉంది

ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. జవాన్ కోసం ఇంకో నెల ఎదురుచూడాల్సిందేనట. నవంబర్ 2 నుంచి జవాన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఆరోజు షారుక్ బర్త్ డే కావడంతో.. ఆయనకు ఈ విధంగా బర్త్ డే విషెస్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారట. అయితే రెండు నెలల తరువాత ఓటిటీలో వచ్చే రేర్ సినిమాల్లో జవాన్ కూడా ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ అధికారికంగా డేట్ ను అనౌన్స్ చేయనుంది. మరి థియేటర్ లో రికార్డు కలక్షన్స్ ను బద్దలు కొట్టిన జవాన్.. ఓటిటీలో ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.