Leading News Portal in Telugu

Tiger NageswaraRao: టైగర్.. రవితేజకు ఇంత స్పెషల్ అని అనుకోలేదే.. భలే ఉంది


Tiger NageswaraRao: టైగర్.. రవితేజకు ఇంత స్పెషల్ అని అనుకోలేదే.. భలే ఉంది

Tiger NageswaraRao: సెల్ఫ్ మేడ్ స్టార్ అంటే.. మొదట చిరంజీవి పేరు.. తరువాత ఎవరైనా చెప్పే పేరు మాస్ మహారాజా రవితేజ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రవితేజ వచ్చిన విధానం ఎంతోమందికి ఆదర్శం.అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్.. అక్కడనుంచి హీరో, స్టార్ హీరో.. మాస్ మహారాజా రవితేజ..ఇలా అంచలంచలుగా రవితేజ ఎదిగాడు. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాన్ ఇండియా ప్రయత్నిస్తున్నాడు. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ షురూ చేసిన రవితేజ.. వరుసగా ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమా విశేషాలను పంచుకుంటున్నాడు. ఇక తాజాగా రవితేజ, డైరెక్టర్ వంశీ తో కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్ ఇంటర్వ్యూ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Tarun Bhasker: బ్రహ్మానందం ఇంటికెళ్లి .. నేను తరుణ్ అని చెప్తే.. అయితే ఏంటి అన్నారు

ఇక ఈ ప్రోమోలో సందీప్ రాజ్.. ఒక ఆసక్తికరమైన విషయాన్నీ చెప్పుకొచ్చాడు. రవితేజ కెరీర్ గ్రాఫ్ లో ఆయనకు మైలురాయిగా నిలిచిన సినిమాలకు డైరెక్టర్ పేరు వంశీనే అని తెలిపాడు. రవితేజకు ఫస్ట్ గుర్తింపు తెచ్చిన చిత్రం సింధూరం. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హాయ్ రే హాయ్ .. జాంపండు రోయ్ అనే పాట.. రవితేజకు ఎంత గుర్తింపు అందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాతే రవితేజకు హీరో ఛాన్స్ లు మొదలయ్యాయి. ఆ తరువాత అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. రవితేజకు సోలో హీరోగా నిలబెట్టిన సినిమా. దీనికి డైరెక్టర్ వంశీ. ఈ సినిమా ఎంత భారీ హిట్ ను అందుకుందో అందరికీ తెల్సిందే. ఈ చిత్రం తరువాత రవితేజ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. ఇక ఇప్పుడు.. రవితేజ మొదటి పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు.. ఈ డైరెక్టర్ పేరు కూడా వంశీనే. ఇలా మాస్ మహారాజా కెరీర్ గ్రాఫ్ లో వంశీ పేరు కీలకంగా వినిపిస్తుంది. ఆ సెంటిమెంట్ తో చూసుకుంటే.. టైగర్ నాగేశ్వరరావు భారీ విజయం అందుకునేలా ఉందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.