
Tarun Bhasker: పెళ్లి చూపులు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న తరుణ్ .. ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో కుర్రాళ్ళ ఫెవరేట్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఒకపక్క డైరెక్ట్ చేస్తూనే.. ఇంకోపక్క నటుడిగా కూడా కొనసాగుతున్నాడు. చాలా గ్యాప్ తరువాత తరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కీడా కోలా. చైతన్య రావు, రాగ్ మయూర్, రవీంద్ర విజయ్, రఘురామ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా నవంబర్ 3 న రిలీజ్ కు సిద్దమయ్యింది. దీంతో ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్రబృందం.. టీమ్ మొత్తంతో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో బ్రహ్మానందం కూడా యాడ్ అయ్యారు. దీంతో ఈ ఇంటర్వ్యూ మొత్తం నవ్వులు విరిశాయి.
Vijay Antony: విజయ్ ఫ్యాన్స్ కు చేదు వార్త.. ?
ఇక ఈ ఇంటర్వ్యూలో తరుణ్.. బ్రహ్మానందం ను మొదటిసారి కలిసినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ను వివరించాడు. ” మొదట నేను బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అనుకున్నప్పుడు.. ఆయన కొడుకు గౌతమ్ ను కలిసి.. నాన్నగారిని కలవాలని చెప్పాను. ఆ తరువాత బ్రహ్మానందం గారిని కలవడానికి ఇంటికి వెళ్లి.. నేను తరుణ్ సర్ అని చెప్పగానే.. అయితే ఏంటీ.. నువ్వేమైనా ప్రెసిడెంట్ వా అని అడిగారు. దానికి నేను షాక్ అయ్యాను. వాళ్ళు కథ చెప్పడానికి నెర్వస్ అవుతున్నారు.. టీమ్ తో మింగిల్ అవ్వండి అని గౌతమ్ చెప్పడంతో ఆయన అలా చేశారని తరువాత చెప్పారు..” అని తరుణ్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తరువాత ప్రాజెక్ట్ ఓకే చేసి సెట్‌లోకి వెళ్లాక టీమ్ అంతా తనని ఓ యాక్టర్‌గా చూడలేదని, తనని ఓ ఫాదర్‌గా, పెద్ద మనిషిగా చూశారని బ్రహ్మీ తెలిపారు. మరి ఈ సినిమా ఈ టీమ్ కు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.