Leading News Portal in Telugu

Game Changer: దసరాకి ‘జాబిలమ్మ’ జాకెట్ వేసుకోని వస్తుందా? నమ్మకం లేదు శంకరా


Game Changer: దసరాకి ‘జాబిలమ్మ’ జాకెట్ వేసుకోని వస్తుందా? నమ్మకం లేదు శంకరా

ప్రస్తుతం స్టార్ హీరోల అభిమానుల్లో ఎక్కువగా బాధపడుతున్నది మెగాభిమానులే. ఎందుకంటే… అందరి హీరోల సినిమాల అప్డేట్స్ వస్తున్నాయి కానీ షూటింగ్ మొదలు పెట్టి రెండేళ్లు దాటిన గేమ్ చేంజర్ విషయంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మొన్న ఇండియన్ 2 డబ్బింగ్ వల్ల… గేమ్ చేంజర్ షూటింగ్ జరుగుతుందనే క్లారిటీ మాత్రం ఇచ్చాడు శంకర్. ఇప్పటి వరకు టైటిల్ వీడియో, ఓ పోస్టర్ తప్పితే గేమ్ చేంజర్ నుంచి సాలిడ్ అప్డేట్ ఒక్కటి కూడా బయటికి రాలేదు పైగా మధ్య మధ్యలో లీకులు మెగా ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్నాయి. దాంతో చేసేది లేక… ఎన్నోసార్లు అప్డేట్ కావాలని సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రెండ్ చేశారు అభిమానులు. ఫాన్స్ ఎన్ని చేసినా శంకర్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. నిర్మాత దిల్ రాజు కూడా అన్ని శంకర్‌కే తెలుసని చెబుతున్నాడు కాబట్టి.. గేమ్ చేంజర్ థియేటర్స్ లోకి ఎప్పుడుస్తోందో శంకర్‌కే తెలియాలి.

సినిమా రిలీజ్ విషయం పక్కన పెడితే ఈసారి మాత్రం గేమ్ చేంజర్ అప్డేట్ పక్కా అంటున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎలాగూ “జాబిలమ్మ జాకెట్ వేసుకోని వచ్చింది… జరగండి జరగండి జరగండి” సాంగ్ లీక్ అయ్యింది కాబట్టి.. ఫుల్ సాంగ్‌ని రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అకేషన్ ఉన్నా అప్డేట్ వస్తుందనే నమ్మకం మాత్రం లేదని… కొందరు మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఒకవేళ సాంగ్ రిలీజ్ చేసే అవకాశం ఉంటే… ఈపాటికే తమన్ సోషల్ మీడియాలో హింట్ ఇచ్చేసేవాడు. మరో పది రోజుల్లో దసరా పండగ ఉంది కానీ ఇప్పటి వరకు ఎలాంటి హింట్ లేదు కాబట్టి.. స్వయంగా శంకర్ చెప్పేవరకు ఇలాంటి వార్తలన్నీ పుకార్లకే పరిమితం అనుకోవాలి. అన్ని పండగలు, అకేషన్లు పోయిన తర్వాత దసరాపై హోప్స్ పెట్టుకున్న మెగా ఫ్యాన్స్… సాంగ్ బయటకి రాకపోతే మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేయడం గ్యారెంటీ.