Leading News Portal in Telugu

Anil Ravipudi: మహేష్ తో సినిమా.. అసలు నిజం చెప్పిన అనిల్ రావిపూడి


Anil Ravipudi: మహేష్ తో సినిమా.. అసలు నిజం చెప్పిన అనిల్ రావిపూడి

Anil Ravipudi: అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పేరు. వరుస సినిమాలతో మంచి హిట్లు అందుకుంటున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు బాలయ్య తో జతకట్టాడు. ఇప్పటివరకు కామెడీ సినిమాలతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న అనిల్.. మొట్ట మొదటిసారి తన పంథాను వదిలి.. బాలకృష్ణతో యాక్షన్ ఎంటర్ టైనర్ కు సిద్దమయ్యాడు. అదే భగవంత్ కేసరి. బాలకృష్ణ, కాజల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈసినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక తాజాగా అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో మరోసారి సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఒక క్లారిటీ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో సరిలేరు నీకెవ్వరూ అనే సినిమా వచ్చిన విషయం తెల్సిందే.

Posani Krishna Murali: జూనియర్ ఎన్టీఆర్ అయినా..జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒకటే

గుంటూరు కారం తరువాత మహేష్ బాబు.. రాజమౌళి సినిమా ఉండనున్న విషయం తెల్సిందే. ఇక రాజమౌళి సినిమాకు ముందు మహేష్.. అనిల్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలో నిజం లేదని అనిల్ చెప్పుకొచ్చాడు.. “మహేష్ గారు నా సినిమాలు అన్ని చూస్తారు. నేను మిస్టేక్ చేస్తే ఓపెన్ గా చెప్తారు. అంత హెల్తీ రిలేషన్ ఉంది. ఆయన పిలిస్తే ఎప్పుడైనా మూవీ చేస్తా.. కానీ, SSMB29 ముందు మాత్రం మహేష్ తో సినిమా చేయడం లేదు.. ఇది ఫేక్ న్యూస్” అని చెప్పుకొచ్చాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.