Leading News Portal in Telugu

Tiger Nageswara Rao: టైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, టైం ఫిక్స్.. ఇక కాస్కోండి!


Tiger Nageswara Rao: టైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, టైం ఫిక్స్.. ఇక కాస్కోండి!

Tiger Nageswara Rao Pre Release Event at Shilpakala Vedika: మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వర రావు రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురంలో గజదొంగగా పేరు సంపాదించిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. కొత్త దర్శకుడు వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 15న హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అక్టోబర్ 3న ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఇప్పుడు శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

KCR: ‘కేసీఆర్’గా రాకింగ్ రాకేష్.. ఇదేం ట్విస్టురా అయ్యా?

ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తవగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ మూవీ రన్​టైమ్ గురించి కూడా సినిమా యూనిట్ ఓ న్యూస్ చెప్పింది. ఈ సినిమా ఏకంగా 3.02 గంటలు ఉండనుందని చెబుతూ పోస్టు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ ఏడాది అత్యధిక రన్​టైమ్ ఉన్న సినిమాగా ‘టైగర్‌ నాగేశ్వరరావు’ నిలిచింది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్‌ 20న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందగా రవి తేజ సరసన నుపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నటి రేణు దేశాయ్ హేమలత లవణం అనే ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.