Leading News Portal in Telugu

Lokesh Kanagaraj :లియో మూవీ మొదటి పది నిముషాలు అస్సలు మిస్ అవ్వొద్దు..


Lokesh Kanagaraj :లియో మూవీ మొదటి పది నిముషాలు అస్సలు మిస్ అవ్వొద్దు..

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.. ఇప్పుడు లియో సినిమాతో మరోసారి తన మార్క్ చూపించేందుకు సిద్ధం అయ్యాడు ఈ యంగ్ డైరెక్టర్.ఈ సినిమాలో దళపతి విజయ్ హీరోగా నటించాడు… చాలాకాలం తర్వాత సీనియర్ హీరోయిన్ త్రిష విజయ్ సరసన హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే విడుదల అయిన లియో ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన లియో ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని రికార్డ్ సృష్టించింది.అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో లియో సినిమాకు సంబంధించిన క్రేజీ విషయాలు పంచుకున్నాడు లోకేష్ కనకరాజ్.

“ఎప్పుడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌ ను థియేటర్లలో లియో ద్వారా ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా లియో సినిమా మొదటి పది నిమిషాలు అస్సలు మిస్ కాకండి. ఆ 10 మినట్స్ ఎంతో స్పెషల్‌గా ఉంటుంది. దానికోసమే గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాం” అని లోకేష్ కనకరాజ్ చెప్పుకొచ్చాడు.”లియోలో ఒక కోల్ట్ రావడం చూసే ఉంటారు. అది మీకు థియేటర్‌లో మంచి అనుభూతిని ఇస్తుంది. అలాంటి థియేటర్ ఎక్స్ పీరియన్స్ మన ఊరిలో రావాలన్న ప్రశ్నకు సమాధానంగా చేసిన ప్రయత్నమే గాడిద, పులి కాన్సెప్ట్. చిరుతపులి ఒక సెపరేట్ ఫ్యామిలి. ఒక్క జంతువు మాత్రమే నవ్వుతుందని అంటారు. హైనా అస్సలు గర్జించదు. ఈ కథతో సమ్‌థింగ్ ఉండనుంది. గాడిద మీకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని లోకేష్ తెలిపారు.ఇదిలా ఉంటే లియో సినిమాలో గౌతమ్ మీనన్, మిష్కిన్, అర్జున్ సర్జా, సంజయ్ దత్, మన్సూర్ అలీఖాన్ వంటి వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక లియో సినిమా అక్టోబర్ 19న గ్రాండ్ గా విడుదల కానుంది.