Leading News Portal in Telugu

Bhagavath Kesari: భగవంత్ కేసరికి షాకింగ్ బిజినెస్.. ఎన్ని కోట్లకు అమ్ముడు పోయిందంటే?


Bhagavath Kesari: భగవంత్ కేసరికి షాకింగ్ బిజినెస్.. ఎన్ని కోట్లకు అమ్ముడు పోయిందంటే?

Bhagavath Kesari Worldwide Pre-release Business: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ‘భగవంత్ కేసరి’ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. హిందీ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ సహా విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపథ్యంలో అసలు ఈ సినిమా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలి అంటే ఎంత వసూలు చేయాలి అనే విషయాలు ఇప్పుడు పరిశీలిద్దాం. బాలకృష్ణ తొలిసారి దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి భగవత్ కేసరి అనే సినిమాని అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు.

Leo: ‘లియో’కి వందల కోట్ల బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలంటే?

ఈ సినిమా ముందు నుంచి పాజిటివ్ బజ్ తో ఉండడం దసరా సీజన్ బాక్స్-ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడానికి బాగా సహాయపడుతుందని అంటున్నారు. ఈ సినిమా మంచి థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ క్రమంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ రాబట్టాలంటే 70 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉందని అంటున్నారు. బాలకృష్ణ భాగవత్ కేసరి వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు చూద్దాం. నిజాం 15 కోట్లు, సీడెడ్ 14 కోట్లు, ఉత్తరాంధ్ర 8.2 కోట్లు, గుంటూరు 6 కోట్లు, తూర్పు గోదావరి 5 కోట్లు, పశ్చిమ గోదావరి 4.2 కోట్లు, కృష్ణు 4.25 కోట్లు, నెల్లూరు 2.6 కోట్లు అలా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో 59.25 కోట్లు, మిగతా భారత దేశం అంతా కలిపి 4.5 కోట్లు ఓవర్సీస్ లో 6 కోట్లు అలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 69.75 కోట్లు బిజినెస్ చేసింది ఈ సినిమా.