
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక అగర్వాల్ నిర్మిస్తున్నాడు. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు వంశీ. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రేణు దేశాయ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
Sai Dharam Tej: అన్ని మామ పోలికలే.. ఎంతైనా మెగా ఫ్యామిలీ కదా
ఇక ఈ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ.. ” ముందు సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. అందరూ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా రామ్ లక్ష్మణ్.. ఆ ట్రైన్ సీన్స్ కోసం ఎంతో కష్టపడ్డారు. వారికి అంత బాగా ఎందుకు వచ్చింది అంటే.. వారు కూడా చీరాలకు చెందినవారే.. నాక్కూడా ఈ కథ గురించి కొంత తెలుసు కానీ, డైరెక్టర్ రీసెర్చ్ చేసి చెప్పడంతో మరింత తెలుసుకున్నా. ఇక ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న రేణు దేశాయ్ కు థాంక్స్.. ఆ క్యారెక్టర్ లో ఆవిడ ఎంత బాగా సెట్ అయ్యిందో అంటే.. అస్సలు నమ్మలేరు. ఇక మా నిర్మాత అభిషేక్ అగర్వాల్. మనిషి ఎంత భారీగా ఉంటాడో.. ఈ సినిమా కూడా అంత భారీగా ఉంటుంది. థాంక్యూ అభిషేక్.. మీతో ఇంకా ఇంకా సినిమాలు చేయాలనుకుంటున్నాను. మా అందమైన హీరోయిన్లు చాలా బాగా చేశారు. ఇక డైరెక్టర్ గురించి ఇప్పుడు మాట్లాడడం కంటే.. సక్సెస్ అయ్యాకా మాట్లాడితే బావుంటుంది అని అనుకుంటున్నాను. ఈ సినిమా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో అల్ ఎమోషన్స్ ఉన్నాయి. థ్రిల్ల్ ఫీల్ అవుతారు. కచ్చితంగా థియేటర్ లో చూడండి. ఇక నా సినిమాతో పాటు.. నాకెంతో ఇష్టమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. మన బాలయ్య సినిమా భగవంత్ కేసరి కూడా రిలీజ్ అవుతుంది.. రెండు సినిమాలు హిట్ అందుకోవాలని కోరుకుంటున్నాను.. ఈ రెండింటితో పాటు విజయ్ లేవు కూడా రిలీజ్ అవుతుంది. అది కూడా విజయం అందుకోవాలని ఆశిస్తున్నాను .. థాంక్యూ.. జై సినిమా” అని ముగించాడు.