
Renu Desai:మాస్ మహారాజా రవితేజ, నూపుర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రీఎంట్రీ ఇస్తోంది. దీంతో సినిమాపై మరింత ఆసక్తి క్రియేట్ అయింది ఇక ఈ సినిమా అక్టోబర్ 20 న రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు చిత్ర బృందం మొత్తం కదిలివచ్చింది.
Balakrishna: అతను ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం..
ఇక ఈ ఈవెంట్ లో రేణు దేశాయ్ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం.. ఇప్పటివరకు మీరందరు నాపై చూపించిన ప్రేమకు థాంక్స్. 23 ఏళ్ళు అవుతుంది.. బద్రి రిలీజ్ అయ్యి.. కానీ, నిన్న, మొన్న రిలీజ్ అయ్యినట్లే నా మీద ప్రేమ చూపిస్తున్నారు. నేను సినిమా చేయకుండా.. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా.. ఎప్పుడైనా కనిపిస్తే.. పలకరిస్తారు. సోషల్ మీడియాలో ఫాలో చేస్తారు. నన్ను ఇప్పటివరకు ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్తున్నాను. ఇప్పటివరకు నేను డైరెక్టర్ వంశీ, అభిషేక్ అగర్వాల్ కు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఇంకోసారి చెప్తున్నాను .. ఇలాంటి పాత్రను నాకు ఇచ్చినందుకు. ముఖ్యంగా ఈరోజు నేను రవితేజ కు థాంక్స్ చెప్తున్నాను. హేమలత లవణం పాత్ర నా దగ్గరకు 2019 లో వచ్చింది. ఆ తరువాత కరోనా పాండమిక్ వలన షూటింగ్ ఆగింది. కొన్ని నెలల తరువాత వంశీ నాకు కాల్ చేసి.. షూటింగ్ మొదలవుతుంది, రవితేజ హీరోగా ఓకే అన్నారు అని చెప్పాడు. అప్పుడు నేను అడిగింది ఒకటే మాట.. నేను ఉన్నానా.. ? నన్ను తీసేసారా ..? అని అన్నాను. ఎందుకంటే.. రవితేజ చాలా పెద్ద యాక్టర్.. కావాలంటే.. నాకన్నా పెద్ద నటిని తీసుకోగలడు, నాకన్నా పేరు ఉన్న, ఇంకా ఫేమస్ అయిన నటిని పెట్టుకోగలరు. కానీ, నన్ను ఆ పాత్రకే అనుకున్నారు.. రవితేజ సర్.. మీకు ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే.. రుణపడి ఉంటాను. పబ్లిక్ లో మీకు థాంక్స్ చెప్పడానికి ఈ మూమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఆయన తీసుకున్న నిర్ణయం నాకు చాలా ముఖ్యమైంది. అక్టోబర్ 20 న టైగర్ నాగేశ్వరరావు.. థియేటర్ లో మాత్రమే చూడండి ” అని చెప్పుకొచ్చింది.