
Naveen Polishetty: జాతిరత్నం నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్యనే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాల విషయం పక్కన పెడితే.. నవీన్ సెన్సాఫ్ హ్యూమర్ గురించి చెప్పుకోవాలి. నవీన్ ఎక్కడ ఉంటే.. అక్కడ నవ్వులు విరబూయాల్సిందే. సినిమానే కాదు ఏ ఈవెంట్ లో అయినా నవీన్ ఉంటే ఆ జోష్ వేరు. ఇక తన సినిమా ప్రమోషన్స్ కూడా ఎంతో డిఫరెంట్ గా చేస్తూ ఉంటాడు. తాజాగా మరోసారి నవీన్.. తనదైన రీతిలో తన సినిమాకు ప్రమోషన్ చేసి షాక్ ఇచ్చాడు.. ప్రస్తుతం ప్రపంచం అంతా సోషల్ మీడియా లోనే నడుస్తుంది. యూట్యూబ్, ఫుడ్ బ్లాగర్స్, ట్రావెల్ బ్లాగర్స్.. ప్రపంచం మొత్తం తిరిగి ఆ వీడియోలను, ఆ అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ డబ్బుకు డబ్బు .. పేరుకు పేరు సంపాదించుకుంటున్నారు.
Nandamuri Balakrishna: మొన్న అన్నాడు ఎవడో వెధవ.. విగ్ పెట్టుకుంటా అని..వాడికి చెప్తున్నా
ఇక అందులో ఒకడు అన్వేష్. యూట్యూబ్ లో లక్షలాది ఫాలోయర్స్ ఉన్న అన్వేష్ చిన్ని అనే వ్యక్తి ప్రపంచం మొత్తం రౌండ్లు కొడుతూ మారుమూల దేశాల వీడియోలు అక్కడి పద్ధతులు, ఆహారపు అలవాట్లు తదితర వీడియోలు నా అన్వేషణ అనే పేరుతో రెగ్యులర్ గా పెడుతుంటాడు. అతనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఉత్తరాంధ్ర యాసలో అన్వేష్ మాట్లాడుతూ.. కామెడీ చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా నవీన్.. అన్వేష్ ను ఇమిటేట్ చేశాడు. డిట్టో అన్వేష్ వాయిస్ ను దింపేశాడు. ” హాయ్ ఫ్రెండ్స్ .. మనం లాస్ ఏంజెల్స్ వచ్చేశాం.. ఆటగాళ్లు అందరు చూసేస్తున్నారు వీడియో.. ఆటగాళ్లకు చెప్పేది ఏంటంటే.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చూసేయండి..” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.