Leading News Portal in Telugu

Bhagavanth Kesari: బాలయ్య ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. దసరా తరువాతే..


Bhagavanth Kesari: బాలయ్య ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. దసరా తరువాతే..

Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీలీలఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి, అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ నిన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక అన్ని ఇంటర్వ్యూలకు బాలయ్య అటెండ్ కాలేకపోవడంతో .. ఆ బాధ్యతను డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీలీల, కాజల్ తీసుకున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ అని వదలకుండా అన్ని కవర్ చేస్తూ ప్రమోషన్స్ వేరే లెవెల్ లో చేస్తున్నారు.

Amardeep Mother: పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మమ్మల్ని వేధిస్తున్నారు.. నీచంగా వాడి దగ్గరకు పంపిస్తావా అంటూ

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి.. బాలయ్య ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పుకొచ్చాడు. మొదట నుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షోకు బాలయ్య ఫ్యాన్ వెళ్లకుండా అయితే ఉండడు. అయితే .. ఈ సినిమాలోని ఒక సాంగ్ మొదటి వారం రోజులు ఉండదట. “ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ ఎమోషనల్ సాంగ్ ను దసరా రోజు సినిమాలో యాడ్ చేస్తాం, రిలీజ్ రోజు మాత్రం ఈ సాంగ్ సినిమాలో ఉండదు.. వారం తర్వాత ఈ సాంగ్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చెయ్యొచ్చు” అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. దీంతో మొదటి వారం రోజులు వెళ్లిన బాలయ్య ఫ్యాన్స్ కు ఆ సాంగ్ ను చూసే అవకాశం లేదు. అయితే ఆ పాత హిట్ అయితే .. దానికోసం మరోసారి సినిమాకు వెళ్లొచ్చు… అదే వేరే విషయం. కానీ, సాంగ్ ఉండే ఎమోషన్స్ మొదట వారం రోజులు ఫ్యాన్స్ మిస్ అవుతారు అనే చెప్పాలి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.