Leading News Portal in Telugu

Chinna : ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతున్న సిద్దార్థ్ చిన్నా మూవీ..?


Chinna : ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతున్న సిద్దార్థ్ చిన్నా మూవీ..?

ఎట్టకేలకు హీరో సిద్దార్థ్ తెలుగులో చిన్నా సినిమాతో మంచి విజయం సాధించాడు.. ఈ మూవీ రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది.అక్టోబర్‌ 6న టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్నా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని నిర్మించింది హీరో సిద్ధార్థ్‌ కావడం గమనార్హం . ఈ మూవీ కి ఎస్‍యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. అరుణ్ కుమార్.. చైల్డ్ అబ్యూజింగ్, హరాస్మెంట్‌ వంటి సున్నితమైన అంశాలను డీల్ చేసిన విధానం ఎంతో బాగుంది. ఇందులో నటీనటులు అద్భుతంగా నటించారు.ఈ చిత్రంలో నిమిషా విజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.థియేటర్లలో సూపర్‌ హిట్‌ గా నిలిచిన చిన్నా మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ దక్కించుకుంది. ఈ నెల చివరి వారం లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కు రాబోతున్నట్లు సమాచారం.. త్వరలో స్ట్రీమింగ్‌ డేట్‌ను ప్రకటించే అవకాశం కూడా ఉంది.

చిన్నా సినిమాకు విశాల్ చంద్రశేఖర్, దిబు నినన్ థామస్, సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించారు.. గతంలో టాలీవుడ్ లో సిద్ధార్ధ్ కు లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాతో ఫ్యామిలి ఆడియెన్స్ తో పాటు యూత్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్ధార్థ్. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ మరియు లవ్ ఫెయిల్యుర్ వంటి సినిమాలు సిద్దార్థ్ కు తెలుగులో మంచి గుర్తింపునిచ్చాయి. రీసెంట్ గా ఈయన నటించిన మహాసముద్రం, టక్కర్ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.అయితే చిన్నా సినిమా సిద్దార్థ్ కు మంచి ఊరటను ఇచ్చింది..సిద్దార్థ్ కు ఈ సినిమా మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పాలి.. చాలా కాలం తరువాత తెలుగులో హిట్ అందుకోవడంతో సిద్దార్థ్ ఎంతో సంతోషంగా వున్నాడు