
Kiara Advani: ప్రొఫెషన్ వేరు.. పర్సనల్ వేరు. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అదే చేస్తోంది. పెళ్లి తరువాత.. చీర కట్టాలి, బొట్టు పెట్టాలి.. కెరీర్ ను వదిలేయాలి.. భర్త చెప్పిన మాట వినాలి.. అనేది కాకుండా తనాకు నచ్చినట్లు తన కెరీర్ ను సెట్ చేసుకుంటుంది. ఈ ఏడాది ఈ భామ.. హీరో సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఈ భామ.. పెళ్లి తరువాత కూడా కెరీర్ ను వేగంగా దూసుకుపోయేలా ప్లాన్ చేసుకుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో వరుస హిట్లతోదూసుకెళ్తున్న కియారా.. ఫ్యాషన్ ఐకాన్ గా మారింది. ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ తో హొయలు పోయింది. ఇంకా ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేయడం ఆగలేదు.. అప్పుడే మరో ఫోటోషూట్ తో చెలరేగిపోయింది. అయితే ఈసారి ఫెమినా మ్యాగజైన్ కోసం చిన్నది ఫోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Bhagavanth Kesari: బాలయ్య ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. దసరా తరువాతే..
అల్ట్రా స్టైలిష్ మోడల్ గా ముద్దుగుమ్మ అదరగొట్టింది. అందాల ఆరబోతను మాత్రం అస్సలు తగ్గించలేదు. సిల్వర్ కలర్ డ్రెస్ లో ఎద అందాలను, గ్రీన్ కలర్ డ్రెస్ లో నడుము వంపులను, వైట్ కలర్ డ్రెస్ లో హాట్ నెస్ ను లోడ్ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసిన కియారా అభిమానులు.. హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అని అంటుండగా.. మరి కొందరు మాత్రం పెళ్లి తరువాత కూడా ఏంటీ అరాచకం.. నీ భర్త ఏం అనడం లేదా..?.. కొంచెం పద్దతిగా ఉండు అంటూ సలహాలు ఇస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం కియారా తెలుగులో రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది.