
Raviteja: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయనలో ఉన్న ఎనర్జీ, స్పాంటేనియస్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవరు మ్యాచ్ చేయలేరు. నిత్యం యాక్టివ్ గా కనిపించే రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కుతున్న ఈ సినిమా పై రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకు కారణం రవితేజ కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కావడం. ఇక దీంతో అన్ని భాషల్లో మాస్ మహారాజా ఈ సినిమాను ప్రమోట్ చేయడం కూడా మొదలుపెట్టాడు. గత కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న రవితేజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిమానులతో చిన్న చిట్ చాట్ సెషన్ పెట్టాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు.
National Award Winners: ఇది రా టాలీవుడ్ అంటే.. ఈ ఒక్క ఫోటో చరిత్రలో నిలిచిపోతుంది
ఇందులో ఒక అభిమాని ఇప్పటివరకు మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా ఫేవరెట్ హీరోయిన్ గురించి గానీ, ఆడవాళ్ళ గురించి గానీ ఎప్పుడూ మాట్లాడలేదు. మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు..? ఆడవాళ్ళలో మీకు నచ్చే లక్షణాలు ఏంటి..? అని అడగ్గానే రవితేజ ..ఏంటి నాకు ఏమైనా పెళ్లి సంబంధం చూస్తున్నావా..? ఆడవాళ్ళ గురించి అడుగుతున్నావ్ అంటూ జోక్ చేశాడు. ఆ తర్వాత తనకు ఎలాంటి ఫేవరెట్ హీరోయిన్ లేదని, అందరూ హీరోయిన్స్ తనకు నచ్చుతారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆడవాళ్లు అంటేనే ఇష్టమని తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన మాస్ మహారాజా అభిమానులు.. ఎనర్జీకి, సెన్సార్ హ్యూమర్ కు రవితేజ బ్రాండ్ అంబాసిడర్ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా మాస్ మహారాజా కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.