
Alia Bhatt: బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అలియా తెలుగువారికి మరింత చేరువయ్యింది. ఈ సినిమా తరువాత మరో సినిమా చేయకపోయినా తెలుగులో అమ్మడి క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. ఇక గతేడాది ఈ భామ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్ళాడి, ఒక బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా కూడా మారింది. పెళ్లి తర్వాత ఆలియా బిజినెస్ విమెన్ గా కూడా మారింది. ఒకపక్క సినిమాలు, ఇంకోపక్క వ్యాపారాలు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. ఇక అలియా కెరీర్ హిట్తీ లిస్ట్ తీస్తే మొదటి స్థానం గంగూభాయ్ కతీయవాడి సినిమా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇంట్లో నుంచి పారిపోయి బయటికి వచ్చిన ఒక అమ్మాయి ఒక వేశ్యగా ఎలా మారింది.. ఆ వేశ్యా గృహాన్ని ఎలా ఏలింది అనేది ఈ సినిమాలో చూపించారు.ఇక ఇందులో గంగూభాయ్ గా అలియా ప్రపంచం మొత్తం తనకు ఫిదా అయ్యేలాగా చేసింది. అలాంటి నటనకు ఆమె ఉత్తమ నటిగా ఎన్నికవ్వడం జరిగింది.
Raviteja: నాకు ఫేవరేట్ హీరోయిన్ లేదు.. అస్సలు ఆడవాళ్లు అంటేనే..
నేడు ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల వేడుకలో అలియా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అందుకు కారణం ఆమె పెళ్లి చీరలో రావడమే. గత ఏడాది ఈ చిన్నది ఎంత సింపుల్ గారణబీర్ ను వివాహమాడిందో అందరికీ తెల్సిందే. సబ్యసాచి చీరపై బంగారు వర్ణంలో మెరిసిపోయిన డిజైన్.. సింపుల్ ఆభరణాలు ధరించి అదరగొట్టింది. ఆ పెళ్లి చీరను కట్టుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకుంది. దీంతో అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఒక మహిళ పెళ్లి చీరను మళ్ళీ ధరించడం అంటే అది ఎంతో స్పెషల్ అయితేనే తప్ప ధరించాడు. అలియా మొదటి జాతీయ అవార్డును అందుకోవడానికి ఈ చీరను కట్టుకుంది అంటే.. ఈ అవార్డు ఎంత స్పెషల్ అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.