
మలయాళం నటుడు బిజుమీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ నటుడు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాలో పోలీస్ పాత్రలో నటించి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాతోనే బిజు పేరు సౌత్ ఇండస్ట్రీ లో మారు మోగిపోయింది.ఈ నటుడు చేసిన పాత్రని తెలుగు లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా లో నటించి మంచి విజయం సాధించాడు. బిజు మీనన్ తెలుగు లో ఖతర్నాక్’, ‘రణం’ వంటి చిత్రాలలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఇదిలా ఉంటే బిజుమీనన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గరుడన్’. అరుణ్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటిస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్లతో పాటు, టీజర్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ మధ్య మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తెలుగు ప్రేక్షకుల నుంచి ఓటీటీ లో మలయాళ సినిమాలకు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.న్యాయం కోసం పోరాడే ఓ పోలీస్ ఆఫీసర్, జైలు నుంచి విడుదలైన ఓ కాలేజీ ప్రొఫెసర్ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.. ఇక ట్రైలర్లో బిజు మీనన్, సురేష్ గోపి పాత్రల మధ్య డైలాగులు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో కేరళ ఆర్మ్డ్ పోలీస్ కమాండెంట్ పాత్రలో సురేష్ గోపి నటిస్తుండగా కాలేజీ ప్రొఫెసర్ పాత్ర లో బిజు మీనన్ నటిస్తున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై లిస్టిన్ స్టీఫెన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.బిజు మీనన్ ఈ సినిమాతో మరోసారి అదరిపోయే హిట్ అందుకునేందుకు సిద్ధం అయ్యాడు