Leading News Portal in Telugu

War 2 : వార్ 2 నుంచి బయటకొచ్చిన సాలిడ్ అప్డేట్…


War 2 : వార్ 2 నుంచి బయటకొచ్చిన సాలిడ్ అప్డేట్…

బ్రహ్మాస్త్ర సినిమాతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు బాలీవుడ్‌ దర్శకుడు అయాన్‌ ముఖర్జీ. ప్రస్తుతం ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం వార్‌ 2.వై ఆర్ ఎఫ్ స్పై యూనివర్స్ బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుంది.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్ మరియు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్‌ దశలో ఉంది. తాజాగా సినిమా షూటింగ్‌ కు సంబంధించిన స్టన్నింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.భారత సినీ చరిత్రలో ఇదివరకెన్నడూ తెరకెక్కని సినిమాగా భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వార్‌ 2 షూటింగ్‌ ప్రస్తుతం స్పెయిన్‌ లో కొనసాగుతోంది. వార్ 2 యాక్షన్‌ సీక్వెన్స్‌కు సంబంధించిన స్టిల్స్‌ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ చిత్రం 2025 జనవరి 24 న విడుదల కానుంది.

ఈ చిత్రం లో హృతిక్ ను తలదన్నే విధంగా ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ ఉంటుందని సమాచారం..ఎన్టీఆర్ ప్రస్తుతం 30 వ చిత్రం దేవర సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్‌ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే పాపులర్ మలయాళ నటుడు షైన్ టామ్‌ చాకో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తం గా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌ గా విడుదల కానుంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ల పై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు కొరటాల రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నాడు. అలాగే ఈ సినిమా లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

https://twitter.com/scrollandplay/status/1714614208837627976?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714614208837627976%7Ctwgr%5E387dbb58360c4539713b586ce8318fc48078973d%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F