Leading News Portal in Telugu

Allu Arjun: వీడు ఎక్కడున్నా పుష్ప ‘రాజే’రా


Allu Arjun:  వీడు ఎక్కడున్నా పుష్ప ‘రాజే’రా

Allu Arjun Power full entry at Hyderabad after getting national Award: నేషనల్ అవార్డు విన్నింగ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగిన జాతీయ అవార్డుల కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఈ వేడుకలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు. పుష్ప చిత్రానికి గాను బన్నీ ఈ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. అదీకాక ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా బన్నీ సరికొత్త చరిత్రను సృష్టించగా ఆ అవార్డు అందుకున్న క్రమంలో ఈ సందర్భంగా బన్నీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తన ట్వీట్ లో తాను ఈ అవార్డు అందుకునే ఘనతకు, కారణం ఆయనే అని సుకుమార్ గురించి చెప్పుకొచ్చాడు.

Tharun Bhascker: ‘సురేష్ కొండేటి’తో సినిమా చేస్తా.. జర్నలిస్టును అయిపోతానంటున్న తరుణ్ భాస్కర్

‘’జాతీయ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉంది. ఇక నాకు గుర్తింపు ఇచ్చిన జ్యూరీకి, భారత ప్రభుత్వానికి, మంత్రిత్వ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు, ఈ అవార్డు నా వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు మన సినిమాను ప్రేమించి, ఆదరించిన వారందరికి చెందుతుంది’’ అని రాసుకొచ్చారు. ముఖ్యంగా సుకుమార్ సార్ కు నా స్పెషల్ థాంక్స్, ఈ విజయానికి కారణం ఆయనే” అంటూ పోస్ట్ చేశారు.ఇక ఢిల్లీలో అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఆ అనంతరం ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమ నుంచి అవార్డులు అందుకున్న అందరితో ఫోటోలు దిగి పోస్టు చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆయన హైదరాబాదు తిరిగి రాగా ఆయనకు తన నివాసానికి వెళ్లే మార్గంలో అభిమానుల నుంచి అదిరిపోయే వెల్కమ్ లభించింది. “రాజు వెడలే రవి తేజము లరగగా అన్నట్టు ఆయన ఆ అభిమానుల మధ్య ఒక రాజులా ఎంట్రీ ఇస్తున్నాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పుష్ప రాజ్ ఎక్కడున్నా రాజేరా అని అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.