
మెహరీన్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఓ మోడల్ గా తన కెరియర్ ని ప్రారంభించి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి తనకంటూ ఓ స్టార్ డమ్ ను సంపాదించుకున్న వ్యక్తి మెహరీన్. ఈ భామ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. అనంతరం తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. వివిధ భాషల్లోనూ నటించి తన ప్రతిభను చాటుకుంది. తాజాగా ఈ అమ్మడు విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుంది. అనంతరం అమ్మవారిని దర్శించుకోవడం పైన తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. మొదటిసారిగా దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకున్నానని..అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని. నిజానికి చెప్పాలంటే అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని.. దర్శనానికి టెంపుల్ యాజమాన్యం చాలా సహకరించారని తెలిపింది.
Read also:Tiger Nageswarara Rao : టైగర్ నాగేశ్వరావు గ్రాఫిక్స్ కోసం అంత టైం పట్టిందా..?
కాగా ప్రస్తుతం తాను నటించిన రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయని.. ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నానని.. అది కూడా రిలీజ్ సిద్ధంగా ఉందని పేర్కొంది. ఇక మెహరీన్ గురించి చూస్తే ఈమె 5 నవంబర్ 1995 లో పంజాబ్ లో పుట్టింది. మొదటి నుండి మోడలింగ్ పైన ఆసక్తి ఉన్న మెహరీన్ తన పదేళ్ల వయసులో అందాల పోటీలో మొదటి ర్యాంప్ వాక్ చేసి కసౌలీ ప్రిన్సెస్ టైటిల్ను గెలుచుకుంది. తర్వాత టొరంటోలో మిస్ పర్సనాలిటీ సౌత్ ఆసియా కెనడా 2013 కిరీటాన్ని పొందింది. 2016 లో విడుదలైన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఆమె ప్రధానంగా తెలుగు , తమిళం , హిందీ, పంజాబీ చిత్రాలలో నటించింది.