Leading News Portal in Telugu

Bhagavanth kesari: జై బాలయ్య అంటూ థియేటర్లో రచ్చ చేసిన మెగా డైరెక్టర్


Bhagavanth kesari: జై బాలయ్య అంటూ థియేటర్లో రచ్చ చేసిన మెగా డైరెక్టర్

Vasishta Mallidi Hulchul at Bhagavanth Kesari Theatre: అదేంటి బాలయ్య సినిమాకి మెగా డైరెక్టర్ సందడి చేయడం ఏంటి? అని అనుకుంటున్నారా? అవునండీ.. మీ అనుమానం నిజమే. నిజంగానే మెగాస్టార్ తో సినిమా చేస్తున్న దర్శకుడు వశిష్ట మల్లిడి జై బాలయ్య అంటూ సందడి చేశారు. ఈ రోజు బాలయ్య భగవంత్ కేసరి మూవీ థియేటర్స్ లోకి రాగా మొదటి ఆట నుంచే సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోండగా ఈరోజు ఉదయం కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్లో సినిమా యూనిట్ సందడి చేసింది. ఇక ఈ క్రమంలోనే బింబిసార డైరెక్టర్ వశిష్ట మల్లిడి కూడా థియేటర్ కి వెళ్ళాడు. అక్కడ థియేటర్ లో జై బాలయ్య అంటూ కేకలు వేస్తూ వశిష్ట మల్లిడి సందడి చేయగా అందుకు సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bastar: అప్పుడు కేరళ స్టోరీ.. ఇప్పుడు ‘బస్తర్’.. నక్సలైటుగా మారిన అదా శర్మ?

వశిష్ట మల్లిడి బాలయ్య ఫ్యాన్ అనే సంగతి అందరికీ తెలుసు, ఎందుకంటే ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు భగవంత్ కేసరి మూవీ రిలీజ్ సందర్భంగా ఒక అభిమానిగా థియేటర్ లో మూవీని ఆశ్వాదిస్తూ సందడి చేశాడు అన్నమాట. హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వశిష్ట బింబిసార సినిమాతో టాలీవుడ్ లోకి దర్శకుడిగా అడుగుపెట్టి మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టి రెండో చిత్రాన్ని ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో చేసే అవకాశం సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతూ ఉండటం విశేషం. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనుండగా యూవీ క్రియేషన్స్ ఏకంగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.